Tiger and passenger Telugu moral story || పులి బాటసారి బంగారు కడియం ...


#cow #tiger #telugumoralstory ************ " పులి- బాటసారి- బం గారు కడియం " ************** అనగ న గా ఒక అడవి. ఆ అడవిలో పెద్ద చెరువు ఉంది. చెరువుకి అవతలి గట్టున వున్న పొదలో ముసలి పులి ఒకటి నివసిస్తోంది. ఇవతలి గట్టు మీదుగా ప్ర యాణించ డానికి ఒక ర హ దారి వుంది. ఆ దారిలో ఓ బాటసారి వెళుతున్నాడు. అతన్ని చూసిన పులి.‘‘మిత్రమా ..’’ అని కేకేసింది. ఆగి ఆ బాటసారి అటూ-ఇటూ చూస్తూ.." ఇం త పెద్ద అడవిలో అం త ప్రేమగా నన్ను 'మిత్రమా' అని పిలిచే మిత్రుడు ఎవరున్నారు.." అని చుట్టూ చూశాడు. "మిత్రమా.. నిన్నే" అం టూ పులి మళ్ళీ పిలుస్తుంది. పులిని చూసి అత ను ఒక్కసారిగా భయపడ్డాడు. అత ని భ యాన్ని గ మనిం చిన పులి ‘‘భయపడకు! నేను నీ మంచి కోరేదాన్నీ.. చూశావా, నా చేతిలోని బం గారు కడియం. దీనిని నీలాంటి గొప్పవాడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అం దుకే పిలిచాను. ’’ అని బం గారు కడియాన్ని చూపిస్తూ ఊరించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. మెరుస్తోంది.. " బం గారమే! అనుమానం లేదు. కానీ, కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇం కేమయినా ఉందా? తినేయదూ" అని వెనుకడుగు వేయసాగాడు.. అయినా బం గారాన్ని వదులుకోలేక పోతున్నాడు. ఓ పక్క ప్రాణం, మరో పక్క బం గారం . ఏం చేయాలో అం తుచిక్క ట్లేదు బాటసారికి. అతనికి ఆశను కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాలిలో తిప్పుతూ పులి ఇలా అం ది.. ‘‘ నన్ను చూసి నువ్వు భయపడడం లో తప్పులేదు. అయితే యవ్వ నం లో నేను చాలా పాపాలు చేశాను. ఎన్నో జంతువుల్నీ, ఎందరో మనుషుల్నీ పొట్టన పెట్టుకున్నాను. చేయరాని పనులన్నీ చేశాను. దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికిచ్చి పాపాల్ని కడిగేసుకోవాలనే నా తాపత్రయం. ’’ అన్న ది పులి. అయినా అడుగు ముందుకు వేయలేకపోయాడు బాటసారి. ‘‘ముసలిదాన్ని. లేవలేను. పరిగెత్తలేను. చేతి గోళ్ళూ, కాలి గోళ్ళూ రెండూ మొద్దుబారిపోయాయి. పళ్ళూడిపోయాయి. కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు. మాంసం తినడాన్ని ఎప్పుడో మానుకున్నాను. పండ్లూ కాయలూ తిని బతుకుతున్నాను. నా అవతారం చూసావు కదా! నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు. ముందు ఆ చెరువులో స్నానం చేసి, శుచిగా రా! ఈ బం గారు కడియాన్ని తీసుకో!" అం టూ గొప్పగా నటించింది పులి. దాని మాటలు నమ్మిన బాటసారి. ." పాపం అది నిజ మే చెబుతున్న ట్లుంది..అది చెప్పిన ల క్ష ణాల న్నీ క ళ్ళకు క నిపిస్తున్నాయి. పైగా మిత్ర మా..అని సం భోధిస్తుంది.. పాపం పోగొట్టుకుంటానంటుంది.. మిత్రుడిగా త నకు నేను త ప్పా ఇం కెవ రు స హాయం చేస్తారు.." అనుకున్నాడు. బం గారు కడియం కళ్ళ ముందు కదలాడుతోంటే స్నానం చేసేందుకు చెరువులోనికి దిగాడు. అం తే! ఒక్కసారిగా బురదలో దిగబడిపోయాడు. కాలు తీద్దామం టే రావట్లేదు. భయపడ్డాడు.‘‘రక్షించం డి , రక్షించం డి’’ అం టూ కేకలేశాడు. చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి, అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి కడుపు నింపుకుంది. పాపం బాటసారి, దురాశకు పోవడం తో ప్రాణాలే బలి పెట్టాల్సి వస్తుంది. ఈ కథ ద్వారా మ నం తెలుసుకోవ ల సిన నీతి ఏంటం టే.. "దురాశ దుఃఖానికి చేటు."

Comments

Popular posts from this blog