Running race Telugu moral story || పరుగు పందెంలో గెలుపెవరిది Moral story...


************ " పరుగు పందెంలో గెలుపెవరిది..!? " ************ అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు వుండేది. దానికి వేగంగా ప రిగెట్టగలనన్న గర్వం బాగా ఎక్కువ.. తాబేలు చాలా నెమ్మ దిగా,నిదానం గా నడుస్తుండటం తో ఆ కుందేలు తరచూ వెక్కిరించేది. “ ఇం త నిదానం గా నడుస్తున్నావు.. ఈ చోటుదాటి ఎక్క డికైనా వెళ్ళగలవా?” అని ఓ సారి వెటకారం చేసింది. " వెనుకటికి నీలాంటిదే, నారు వేయడానిక ని బయలు దేరితే ...కోతలు అయిపోయాకా చేరుకుందట.." అం టూ నవ్విం ది. “ నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను!” అని గొప్పలు చెప్పుకుంది కుందేలు. " సరే మిత్రమా..! నీ ఆనం దాన్ని నేనెందుకు కాదనాలి.. పరుగు పందానికి నేను సిద్దమే.." వస్తే కొండ-పోతే వెంట్రుక..అనుకుని పందానికి సిద్ద ప డింది తాబేలు. " ఆలోచించుకో... తర్వాత ఇలా నడవడానికి కూడా పనికి రాకుండాపోతావేమో.." అం టూ వెక్కిరించింది కుందేలు. తాను గెల వ డం అసాధ్యం అని తెలిసి కూడా ప్ర య త్నిం చ డం స హ జ ల క్ష ణం క నుక ముంద డుగు వేసింది తాబేలు.. ఆ అడవంతా కుందేలు, తాబేలు పరుగుపందెం గురించే మాట్లాడుకోసాగారు. తాబేలు పోటీలో నిలవడం పై కొన్ని హేళన చేస్తే, మరికొన్ని ఉత్సాహ ప రిచాయి . పందెం రోజు కుందేలు, తాబేలు పోటి చూడడానికి అడవిలో జంతువులన్నీ పోటీ ప్ర దేశానికి చేరాయి. కుందేలు మహా ధైర్యం గా, గర్వం గా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. తాబేలు అణుకువగా, వినయంతో పందెం గీతమీద నిలబడింది.. కోతిని న్యాయనిర్ణేతగా ఎంచుకున్నారు. పందెం మొదలవగానే కుందేలు తుర్రు మని పరిగెట్టడం మొదలు పెట్టింది. తాబేలు నిదానం గా సాగింది. కొంచెం దూరం పరిగెట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్క డా కనిపించ లేదు. " ఆ..దాని మొహం..! అది ఎలాగూ నెగ్గే ప్రశక్తే లేదు..నేనేందుకు అన వస రం గా కష్ట పడడం ? కొంచెం సేపు హాయిగా నిద్రపోయి, నెమ్మ దిగా లేచి, సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు," అనుకుంది. ఒక చెట్టుకింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది కుందేలు. కొంత సేపటికి తాబేలు తన పద్ధతిలో న డుచుకుంటూ అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేలుని చూసింది. కాని తన దారిని తను కొనసాగుతూ, నిదానం గా, చిన్న గా నడుచుకుంటూనే ముగింపు గీత దగ్గిరకి చేరుకుంది. తాబేలు ముగింపు గీత దగ్గిర ఉండగా కుందేలుకి మెలుకువు వచ్చింది. " అమ్మో! ఆ తాబేలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. నాకెందుకు అం త మత్తు ఆవహించింది..నా గర్వ మే నా కొంప ముంచినట్లుంది. " అనుకుని వేగంగా పరిగెత్తింది. కాని, కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి, పోటి నేగ్గేసింది. చుట్టూ జేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు, పొగడ్తలతో అభినం దించారు. కుందేలు చేసేదిలేక గ ర్వాన్ని వీడి త ల దించుకుంది. ఈ క థ ద్వారా మ నం తెలుసుకోద గిన నీతి ఏమిటం టే... " ప్రగల్భాలు పలికే వారు ఎప్పుడూ కార్యాన్ని సాదించలేరు. కాబట్టి ఎప్పుడూ గర్వాన్ని పెంచుకోకూడదు.."

Comments

Popular posts from this blog