One eyed Deer Telugu Moral stoires || ఒంటి కన్ను దుప్పి కష్టాలు తెలుగు న...


#telugumoralstories #moralstories #telugustories ************* " దుప్పి కష్టాలు " ************* అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది. అయితే దానికి ఒక కన్ను లేకపోవడం తో అది తరచూ అవస్థలు పడుతూ వుండేది. ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి, ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది. పైగా తన మిత్రులంతా "ఒం టిక న్నుదీ..ఒం టిక న్నుదీ.. "అం టూ ఆట ప ట్టిస్తూ వుండేవారు. దాంతో అది చాలా బాధ ప డేది. " నా మిత్రులంతా హాయిగా, సం తోషంగా వున్నారు... నేనే, ఒక కన్ను లేక నానా కష్టాలు పడుతున్నాను. ఎటునుండి ఎలాంటి ఇబ్బం ది వస్తుందో తెలియడం లేదు.. ఈ గండం నుండి గట్టెక్కేదెలా.." దానికి వేటగాళ్ల నుండి, క్రూరమృ గాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా ఆలోచించగా ఆఖరికి దానికి ఒక ఉపాయం తట్టింది. " నాకు కన్నువున్న వైపు మాత్రమే కనిపిస్తుంది.. అం దుకే ఆ భాగాన్ని భూమి వైపు వుంచి మేతమేస్తాను...కన్ను లేని మరో భాగాన్ని నది వైపు వుంచుతాను..ఎందుకం టే సముద్రం వైపు నుండి ఏ విధమైన అపాయాలు రావు..సురక్షితం గా వుండొచ్చు" అని అనుకుంది ఆ దుప్పి. ఆరోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని భూమి వైపు, కన్నులేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేసేది. దాంతో దానికి ఎలాంటి కష్టాలు ఎదురుకాలేదు. కాని ఒక రోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణిస్తూ వచ్చాడు. అతడికి దూరం గా గట్టుమీద గడ్డిమేస్తూ దుప్పి కనిపించింది.. " ఇవాళ ఎక్కువగా కష్టపడకుండానే నాకు వేట దొరికింది." అని సం బర పడ్డాడు. వేటగాడి రాక గమనించక దుప్పి తన మానాన తాను గడ్డిమేస్తూ వుంది. " నేను ఒక వేటగాడిని.. నా చేతిలో బాణం వుందీ...అయినా కూడా ఆ దుప్పి చలించక నన్నే చూస్తూ ఎదురునిలబడిందం టే ..దానికి సమయం దగ్గర పడినట్టుంది.. " వెంటనే ఆ వేటగాడు తన బాణం సం ధించాడు. బాణం దుప్పి కాలిలో గుచ్చుకుంది. బాధతో విలవిల్లాడిపోతూ..వేటగాడు వెంబడిస్తున్నా.. దుప్పి అక్క డి నుండి ఎలాగో తప్పించుకుని పారిపోగలిగింది. 'నేను భూమి వైపు నుండి అపాయం వస్తుందనుకున్నాను. కాని అపాయం రాదు అనుకున్న సముద్రం వైపు నుండే అపాయం వచ్చింది. అడవి జంతువులకు అపాయం ఎటువైపు నుండి అయినా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తం గా ఉండాలి' అని అనుకుంది బాధపడుతూ... ఆ రోజు నుండి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సం చరించడం మొదలు పెట్టింది. ఈ క థ లో నీతి ఏంటం టే.. " అపాయం ఎటునుంచైనా రావచ్చు.. ఎల్లప్పుడూ జాగ్ర త్త గా వుండాలి.."

Comments

Popular posts from this blog