రాక్షస బల్లులు మరియు వింత మనిషి || Strange man and Demon lizards Amazing...


#telugumoralstories #telugustories #moralstories **** వజ్రం పోటీ ***** ఒకానొకప్పుడు జమీందారు దగ్గరకు ఉద్యోగం కోసం విజయ్, అజయ్ అనే ఇద్దరు యువకులు వచ్చారు. వారికి పని కల్పించడానికి ముందు ఓ చిన్న పరీక్ష పెట్టాలనుకున్నారు జమీందారు. "చూడండీ.. ఈ ఊరికి ఉత్తరాన దట్టమైన అడవి వుంది. ఆ అడవికి మధ్యలో పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద చాలా విలువైన వజ్రం ఉంది. ఆ వజ్రాన్ని మీలో ఎవరైతే తీసుకుని వస్తారో వారే విజేత.. వారికే గొప్ప పని కూడా దొరుకుతుంది" అని చెప్పారు. దాంతో విజయ్, అజయ్ ఇద్దరూ వజ్రపు కొండను వెతుక్కుంటూ బయల్దేరారు. వాళ్లు అడవిలోకి ప్రవేశించి కొంత దూరం వెళ్లగానే, దారిలో వారికి తీవ్రగాయాలతో ఒక వింత వ్యక్తి కనిపించాడు. ఆగితే ఆలస్యం అయిపోతుందని అజయ్ ముందుకు వెళ్లిపోయాడు. కానీ విజయ్ మాత్రం ఆగి అతడికి సపర్యలు చేయడం ప్రారంభించాడు. కొంతసేపటికి ఆ వింత వ్యక్తి స్దిమిత పడ్డాడు. విజయ్ గురించి అడిగాడు. విజయ్ తన ప్రయాణం గురించి, తను పొందవలసిన వజ్రం గురించి అంతా చెప్పాడు. "దూరంగా కనిపిస్తున్నదే వజ్రం ఉన్న కొండ. కానీ, వజ్రానికి కాపలాగా రాకాసి బల్లులు తిరుగుతూ ఉంటాయి. అది పొందడం చాలా కష్టం.." అన్నాడు వింత మనిషి. "అక్కడ రాకాసి బల్లులు ఉన్న సంగతి నాకు తెలియదు.. ఇప్పుడు నేను ముందుకు వెళ్లాలో, వెనక్కి వెళ్లాలో తెలియడం లేదు.." అన్నాడు సందేహంగా విజయ్. "కానీ నీవు నాకు చేసిన సపర్యలకు ప్రతిఫలంగా, ఆ వజ్రం పొందేందుకు నేను నీకు సాయపడతాను.. పదా.." అని విజయ్‌ని తన భుజం మీద కూర్చోబెట్టుకుని ఎగురుకుంటూ వెళ్లి కొండమీదకు చేరాడు వింత మనిషి. కొండమీద.. వజ్రానికి, భయంకరమైన రాకాసి బల్లులు కాపలా కాస్తూ ఉన్నాయి. వాటిని చూస్తేనే విజయ్‌కి భయం వేసింది. దగ్గరలోనే ఒక చెట్టుకు అజయ్ బంధీ అయి ఉన్నాడు. విజయ్‌ని అక్కడే ఉండమని వింత వ్యక్తి రాకాసి బల్లలకు ఎదురెళ్లాడు. (రాకాసి బల్లి-వింత మనిషి ఫైట్.. ) వింత మనిషి దెబ్బలకు రాకాసి బల్లులు చెల్లా చెదురై పారిపోయాయి. విజయ్ వెళ్లి అజయ్‌ని విడిపించాడు. వింత వ్యక్తి సాయంతో వజ్రాన్ని సంపాదించాడు. కష్టంలో ఉన్నప్పుడు వింత మనిషికి సాయపడకపోవడమే తను చేసిన తప్పని గ్రహించాడు అజయ్. 'పక్కవారికి సాయం చేస్తే అది మనకూ మంచేనన్న విషయం' అప్పుడే అజయ్‌కి అర్ధం అయింది. తరువాత జమీందారు.. విజయ్‌ని వెంట తీసుకుని వెళ్లి ఆ వజ్రాన్ని మహారాజు గారికి అందించాడు. విజయ్‌కి మంచి బహుమతితో పాటు.. రాజుగారి కొలువులో ఉద్యోగం కూడా దొరికింది.. తరువాత ఆ వజ్రం రాజ్య సంక్షేమం కోసం ఉపయోగపడింది. -----------

Comments

Popular posts from this blog