జీవితంలో సమస్యలు చుట్టుముడితే ఏమి చెయ్యాలి చాణుక్యుడు చెప్పిన అద్భుతమైన ...


#telugustories #chanakyastories #moralstories ***** చాణక్య నీతి కథ ***** జీవితంలో సమస్యలు చుట్టుముడితే ఏమి చెయ్యాలి.. చాణుక్యుడు చెప్పిన అద్భుతమైన నీతి కథ .. Start ----- వాయిస్ వావర్ : ఒక అడవిలో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెళుతోంది. అది నిండు గర్భిణి.. దానికి అప్పుడే నొప్పులు మొదలయ్యాయి. అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతూ ఉంది.. లేడి వాయిస్ : " ఆ... ఆ.. అబ్బా.. బాధ భరించలేకపోతున్నాను.. నొప్పులు క్షణక్షణానికి ఎక్కువ అవుతున్నాయి.. నడవడం కష్టంగా ఉంది.. ఇక్కడే ఎక్కడైనా మంచి చోటు కనిపిస్తే బావుండును.. " (కొంతసేపు అక్కడే అటూ ఇటూ తిరిగింది. దగ్గరలోనే దానికి ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది.) లేడి వాయిస్ : "ఆ.. ఆ దట్టమైన గడ్డి భూమే అనువైన చోటు.. బిడ్డ నేలపైకి రాగానే చిన్న దెబ్బ కూడా తగలకుండా మెత్తగా హాయిగా ఉంటుంది. పైగా అటు ప్రక్క నది ప్రవహిస్తోంది. అటునుండి ఎలాంటి హానీ జరగదు.." (భారంగా నడుచుకుంటూ ఆ చోటుకి వెళ్ళింది. అప్పుడే నొప్పులు ఎక్కువగా మొదలయ్యాయి.) లేడి వాయిస్ : "అబ్బా.. అయ్యో.. నొప్పులు మరింతగా పెరిగాయి.. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు.. సహాయం చేయడానికి దగ్గరలో నా మిత్రులు కూడా ఎవరూ లేరు.. అమ్మా.. అబ్బా..ఆ... ఆ..." (నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. అంతలోనే అడవంతా దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. ఉన్నట్టుండి ఉరుములు, పిడుగులు మొదలయ్యాయి.) లేడి వాయిస్ : "అమ్మా.. అబ్బా.. నా పరిస్ధితే ఇంత బాధగా ఉంటే, ప్రకృతి కూడా ఇలా మారిపోయిందేమిటీ.. ఇది నాకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా.." (తన పరిస్దితిని తలుచుకుని చాలా బాధపడిందా లేడి. అకస్మాత్తుగా పిడుగు పడి కొద్ది దూరంలోనే గడ్డి అంటుకుంది.) లేడి వాయిస్ : "అమ్మో.. గడ్డి అంటుకుంది.. ఇటువైపే వస్తోంది.. ఆ.. ఆ.. " (అప్పుడే లేడికి కుడివైపున దూరంలో సింహం ఒకటి వస్తోంది. అది లేడీని చూసింది.) సింహం వాయిస్ : "ఆహా.. ఈ రోజు భలే ఆహారం దొరికింది.. అదను చూసి దాడి చేయాలి.. లేకుంటే ఆ లేడీ దొరికనట్టే దొరికి తప్పించుకోగలదు. మళ్లీ పస్తులు ఉండాలి.." (సమయం కోసం మాటు వేసింది సింహం.. ఎడమవైపు నుండి ఒక వేటగాడు అటుగా వచ్చాడు. లేడీని చూసాడు.) వేటగాడి వాయిస్ : ఇంతకు ముందు ఒకసారి ఇదే లేడీ నా నుండి తప్పించుకుంది. ఈసారి నా బాణం గురి తప్పదు. (వేటగాడు బాణాన్ని ఎక్కు పెట్టేందుకు సరి చూసుకుంటున్నాడు.) వాయిస్ వావర్ : కుడి వైపున ఆకలిగొన్న సింహం, ఎడమ వైపున మృత్యువు రూపంలో వేటగాడు, ఒకవైపు రగులుతూ వస్తున్న మంటలు.. మరోవైపు వేగంగా ప్రవహిస్తున్న నది.. ఆ లేడీకి తప్పించుకునే అవకాశమే లేదు. "భగవంతుడా! ఇప్పుడు ఆ లేడి ఏమి చెయ్యాలి? ఏమి జరగబోతోంది? లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా? బిడ్డ బతుకుతుందా? సింహం లేడిని తినేస్తుందా? వేటగాడు లేడిని చంపేస్తాడా? నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా?" ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రకృతి మొత్తం స్తంభించిపోయి ఏం జరుగుతుందా అని చూస్తోంది. (కాసేపు నిశ్శబ్దం.. లేడీ నొప్పులు పడుతూ ఉంటుంది.) వాయిస్ వావర్ : కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. తన ప్రాణం పోతుందా లేదా అని ఆలోచించనూ లేదు.. లేడి తను బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది. అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి. ఒక్కసారిగా వర్షంతో పాటు పిడుగు పడింది.. ఆ పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు పోయాయి.. వేటగాడి వాయిస్ (అరుస్తూ) : అమ్మో.. నాకు కళ్లు కనిపించడం లేదు... కళ్లు కనిపించడం లేదూ.. వాయిస్ వావర్ : అతడి బాణం గురి తప్పింది.. అది వేగంగా వెళ్లి సింహానికి తగిలింది. (సింహం గాండ్రిస్తూ ప్రాణాలు విడిచింది.) వాయిస్ వావర్ : జోరుగా వాన కురవడంతో అడవిలో రాజుకున్న మంటలు ఆరిపోయాయి. (మంటలు ఆరిపోవడం.) వాయిస్ వావర్ : అదే సమయంలో లేడి పిల్ల తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది. అది చాలా అందంగా, ఆరోగ్యంగా ఉంది. (తల్లి లేడీ, పిల్ల లేడీ ఆప్యాయతను చూపించాలి.) వాయిస్ వావర్ : చూసారా.. అదే లేడి కనుక తన ప్రాణం గురించి అలోచించి ఉండి.. బిడ్డకు జన్మనివ్వడంపై దృష్టి పెట్టకుండా ఉండి ఉంటే… లేడి ఖచ్చితంగా తప్పటడుగు వేసి ఉండేది. అప్పుడు ఏమి జరిగేది.. ఆలోచించండి. "మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి. ప్రతికూల ఆలోచనలతో సతమవుతూనే ఉంటాం. అప్ప్పుడు మన కర్తవ్యాన్ని విస్మరించి.. ఏవోవో ఆలోచిస్తాం.. అలా కాకుండా భగవంతుడిపై భారం వేసి మన పని మనం చేస్తుంటే.. ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాం.." అని చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో తన విద్యార్ధులకు పై నీతి కథను చెప్పాడు. --------

Comments

Popular posts from this blog