Crow changed colour black to white Telugu moral story || కాకి పన్నాగం B...


#Telugumoralstories #moralstories #animalstories ***** కాకి పన్నాగం ***** ఒక అడవిలో రెండు పెద్ద పెద్ద చెట్లు ప్రక్క ప్రక్కనే వుండేవి. ఒక చెట్టుమీద కాకులు గూళ్ళను ఏర్పాటు చేసుకుని వుంటే... మరొక చెట్టుమీద పావురాలు జీవిస్తూ వుండేవి. పగలంతా వేటికవే ఆహారపు వేటలో పరుగులు పెట్టేవి.. రాత్రి అయ్యేసరికి తమ తమ స్దావరాలపై విశ్రాంతి తీసుకునేవి. కాకుల గుంపులో పరమ బద్దకస్తురాలైన కాకి ఒకటి వుండేది. అది లేవడమే లేటుగా లేచేది. మిగిలినవన్నీ ఆహారం కోసం బయటకు వెళ్లిపోతే, అది మాత్రం ఎటూ వెళ్లకుండా చెట్టుమీదే దర్జాగా గడిపేది.. కొంతసేపటికి అవన్నీ ఆహారం తీసుకొచ్చి గుమిగూడి తింటింటే వాటితోపాటే కలిసిపోయి లాక్కుని మరీ తినేసేది. అలా తాము ఆ రోజు సంపాదించిన ఆహారాన్నంతా పోగేసుకుని కాకులు ఒకచోట, పావురాలు ఒకచోట గుంపులుగా చేరి ఆహారాన్ని తినేవి.. అయితే కాకులు ఎప్పుడూ తిట్టుకునో, కొట్టుకునో తమ తమ బలం కొద్దీ ఆహారాన్ని దక్కించుకుంటే... పావురాలు మాత్రం అంతా కలిసి కట్టుగా వుంటూ.. ఎటువంటి గొడవలు పడకుండా.. సమానంగా పంచుకుని తినేవి.. ఆ పావురాల ఐక్యతను చూసిన బద్దకపు కాకి ఇలా అనుకుంది.. " ఆహా .. ఆ పావురాలు చూడు... ఎంత సఖ్యతగా వున్నాయో... మా వాళ్లు చూడు ఎలా వున్నారో.. ఛీ .. పుడితే పులిలా పుట్టాలీ.. లేదా పావురంలా పుట్టాలి.." అని తెగ బాధపడింది.. కొద్దిసేపు ఆలోచనలోపడింది.. ఎటువంటి కష్టమూ లేకుండా ఆహారం సంపాదించడానికి తెలివిగా ఒక పన్నాగం పన్నింది. బట్టలకు రంగులు అద్దేవాడి ఇంటికి వెళ్లి .. తెల్లరంగులో మునిగి లేచింది.. తర్వాత తనను తాను అద్దంలో గొప్పగా మురిసిపోయింది.. " చూడటానికి ఎంత అందంగా వున్నాను.. ఎవరు చూసినా నన్ను పావురమే అనుకుంటారు.. ఇక నుండి నాకు కాకిగోల తప్పింది.. పావురాలతో కలిసి ఎంచక్కా తినవచ్చు.." అని ఎగురుకుంటూ వెళ్లి పావురాల గుంపుతో కలిసిపోయింది.. నెమ్మదిగా కావలసినంత ఆహారం తిన్నది.. తిండికోసం కొట్టుకు ఛస్తున్న కాకులను చూసి అసహ్యించుకుంది.. అలా కొన్ని రోజులు ఆ బద్దకపు కాకి ఎలాంటి కష్టం లేకుండా హాయిగా గడిపేసింది.. ఒకనాడు ఆకలిమీద బాగా తిన్నదేమో.. గొంతుకకు అడ్డుపడటంతో నీటికోసం ఆగలేకపోయింది.. వెంటనే 'కావు కావు' అని గట్టిగా అరిచేసింది.. దాంతో కాకి గుట్టు రట్టయింది.. ఇంకేముందీ, పావురాలన్నీ ఒక్కటై కాకిని ముక్కులతో పొడిచి తరిమేసాయి.. "ఓరినాయినోయ్.. కాస్తంతయినా కనికరం లేకుండా కుళ్లబొడిచేసాయి.. ఇక లాభం లేదు.. నేను నా రూపంలోకి మారిపోవడమే మంచిది.." అని భావించి నీటిలో మునిగింది.. చిత్రం ఏమిటంటే, అది గట్టి రంగు కావడంతో ఎంతకీ తెలుపు పోలేదు.. ఏం చేయాలో పాలు పోక అలా రెండు మూడు రోజులు ఒంటరిగా గడిపింది.. ఇక చూసి చూసి ఆకలికి తట్టుకోలేకపోయిన ఆ కాకి చివరికి ఆహారాన్ని తింటున్న కాకుల గుంపు దగ్గరకు అరుచుకుంటూ వచ్చింది.. అదేదో వింత పక్షి అనుకున్న కాకులన్నీ ఏకమై రక్కుతూ దాన్ని తరిమేసాయి... ఆ బద్దకపు కాకి వేసిన పన్నాగం ఫలించక.. అయిన వాళ్లు కూడా రానీయకపోవడంతో చివరికి ఒంటరిగా మిగిలిపోయింది... ఈ కథలో నీతి ఏమిటంటే..." ఉన్న వాటితో తృప్తి పడాలి... పొరుగు వాటికోసం పరుగులు పెట్టకూడదు.."

Comments

Popular posts from this blog