మంచిగుండు - 02 తెలుగు కామెడీ వీడియో || Manchigundu - 02 Amazing telugu c...

#telugucomedy #comedyvideos #funnyteluguvideo **** 6. మంచిగుండు-2 **** (1వ వాడు చిన్న బడ్డీ దగ్గర కూర్చుని న్యూస్‌ పేపర్లు తిరగేస్తూ ఉంటాడు. పేపర్‌ చూస్తూ.. ) 1వ వాడు: బాలుడిని కిడ్నాప్‌ చేసి పది లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్.. ఛీ.. (అని ఆ పేపర్ ప్రక్కన పడేసి, మరో పేపర్‌ చూస్తూ.. ) 1వ వాడు: మహిళ మెడలో పది తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు.. ఛీఛీ.. (ఆ పేపర్ కూడా ప్రక్కన పడేసి, మరో పేపర్‌ చూస్తూ.. ) 1వ వాడు: శాంతి నగర్‌లో అర్ధరాత్రి దోపిడీ దొంగల హల్‌చల్.. ఛీ.. ఛీఛీ.. (ఇలా చాలా పేపర్లు చదువుతూ, తిట్టుకుంటూ, ప్రక్కకు విసిరేస్తూ ఉంటాడు.) 1వ వాడు: ఈ పేపర్లు చదివి బి.పి తెచ్చుకునే బదులు, ఇంటికెళ్లి రామకోటి రాసుకుంటే బెటర్.. (అని 1వ వాడు లేచి వెళ్లిపోతుంటే... 2వ వాడు అక్కడికి వచ్చి..) 2వ వాడు: మాస్టారూ.. ఏంటి వెళ్లిపోతున్నారు.. కూర్చోండీ .. మాట్లాడుకుందాం.. 1వ వాడు: మాస్టారా..!? ఈ మాట ఎవరో నాతో గతంలో అన్నట్టు గుర్తయ్యా.. ఇంతకు ముందు మనం ఎప్పుడైనా కలిసామా.. (2వ వాడు బుర్ర గోక్కోవడం.) 1వ వాడు: అయినా ఇక్కడే ఉండి పేపర్లో ఆ వార్తలు చదవడం నావల్ల కాదు... నేను బయలుదేరతాను.. (1వ వాడు వెళ్లాబోతుంటే 2వ వాడు ఆపి..) 2వ వాడు: అసలు ఏం వార్తలు మాస్టారూ... 1వ వాడు: ఏ పేపరు చూసినా ఫ్రంట్ పేజీలోనే ఏదో ఒక క్రైం న్యూస్‌ ఏడ్చి చచ్చింది. ఒకచోట కిడ్నాప్‌, మరోచోట దొంగతనం, ఇంకోచోట హత్య.. గవర్నమెంట్ ఎన్ని ఉచిత పధకాలు పెట్టినా వీరు మారరా.. అసలు ఎక్కడనుంచి పుట్టుకొస్తారండీ వీళ్ళూ.. సమాజానికి పట్టిన చీడ పురుగులు వీళ్ళూ... కనబడితే కల్చేయాలీ... నిలబెట్టి ఉరితీసెయ్యాలి.. (అంటూ బాగా ఆవేశ పడిపోతాడు.) 2వ వాడు: అయ్యయ్యయ్యో.. ఎంత పొరపాటు పడుతున్నారు మాస్టారూ.. వీళ్లు ఛీడ పురుగులు కాదు, చాలా మంచి పురుగులు.. (1వ వాడు అయోమయంగా చూడటం.) 2వ వాడు: పైగా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్న గొప్ప వ్యక్తులు.. (1వ వాడు బుర్ర గోక్కోవడం.) 1వ వాడు: ఏందయ్యా.. నేనేమైనా పిచ్చివాడిలా కనిస్తున్నానా.. !? 2వ వాడు: రండి.. కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం.. (ఇద్దరూ ఓ చోట కూర్చుంటారు.) 2వ వాడు: ఈ సిటీలో దాదాపుగా పదివేల మంది పోలీసులు ఉన్నారు.. వాళ్లకు పని కలిపించేది ఎవరు మాస్టారూ.. 1వ వాడు: ఇంకెవరూ .. గవర్నమెంటు.. 2వ వాడు: గవర్నమెంటు కూడా పోలీసులకు ఏం పని చెబుతుందీ.. ఇలాంటి దొంగలను పట్టుకోమనే కదా.. అసలు దొంగలే లేకుంటే పోలీసుల పరిస్దితేంటో ఆలోచించండి మాస్టారూ..! (1వ వాడి రియాక్షన్‌.) 2వ వాడు: పట్టుబడిన దొంగ కూడా దొంగతనం చేసాడో లేదో తేల్చడానికి వాయిదాల మీద వాయిదాలు వేసే కోర్టులు.. ఆ కోర్టుల్లో పని చేసే ఉద్యోగులు.. వీళ్లంతా బ్రతకాలంటే దొంగలు ఉండాలి కదా..! (1వ వాడి రియాక్షన్‌.) 2వ వాడు: దొంగలకు శిక్షపడితే జైలులో పెడతారా లేదా.. ఆ జైలులో పని చేసే ఉద్యోగులకు ఫీడింగ్ ఇచ్చేది మన దొంగలే కదా.. (1వ వాడి రియాక్షన్‌.) 2వ వాడు: వీళ్లే కాక ఇంకా చాలా మందికి ఉద్యోగ భద్రతతో పాటు, వారి వారి కుటుంబాల అవసరాలు, లగ్జరీలు అన్నీ తీర్చేది దొంగలుకాక ఇంకెవరు చెప్పండీ.. (1వ వాడి రియాక్షన్‌.) 2వ వాడు: ఈ దొంగలనే నమ్ముకునే కదా మాస్టారూ.. సిసి కెమెరా కంపెనీలు, గల్లీ గల్లీకి సిసి కెమెరాలు పుట్టుకొచ్చాయి. వీళ్ళే లేకపోతే వాళ్ళ వ్యాపారం ఏమయ్యేదీ.. లక్షల కోట్లు లాస్.. (1వ వాడి రియాక్షన్‌.) 2వ వాడు: చెడ్డీ గ్యాంగునే కనుక అంత ఈజీగా పట్టేసుకుంటే .. పాలక పక్షం, ప్రతి పక్షం తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి టాపిక్‌లు ఏంవుంటాయి మాస్టారూ.. (1వ వాడి రియాక్షన్‌.) 2వ వాడు: ఎంతోమందికి ఎంప్లాయిమెంట్ కల్పిస్తున్న ఇలాంటి గౌరవనీయలైన దొంగలను పట్టుకుని ఛీడ పురుగులు, పేడ పురుగులు అని తట్టడమే కాకుండా .. అందరినీ "మంచిగుండు" అనడం మీ తప్పే కదా..! (1వ వాడికి చిన్న అనుమానం వచ్చి...) 1వ వాడు: "మంచిగుండా.." ఇది కూడా నేను ఇంతకు ముందు ఎప్పుడో విన్నానయ్యా.. (2వ వాడు తన తలపై ఉన్న విగ్గు తీసేసి.. గట్టిగా నవ్వుతాడు. అతడిని గుర్తు పట్టి..) 1వ వాడు: అరే .. మంచిగుండూ.. 2వ వాడు: ఒకడు నా దగ్గర అప్పు తీసుకుని తప్పించుకుని తిరగుతున్నాడు.. వాడిని పట్టుకోవడానికి ఇలా విగ్ పెట్టుకుని వెళుతున్నాను.. వస్తాను మాస్టారూ... (అని 2వ వాడు వెళ్లిపోతాడు.. 1వ వాడు షాక్‌తో చూస్తూ ఉండిపోతాడు. )

Comments

Popular posts from this blog