బిచ్చగాడు తెలుగు కామెడీ వీడియో || Best New Comedy Video || Amazing Funny...


*** బిచ్చగాడు ***** (కామెడీగా కాలం కలిసొచ్చి కోటీశ్వరుడు అయ్యాడు..) (బిచ్చగాడు పాడుతూ.. వీణ స్టెప్ వేస్తూ..) దాయి దాయి దామ్మా.. నేనో బిచ్చగాన్నమ్మా.. నాకు బిచ్చమేయండమ్మా.. మీకు పుణ్యం వస్తుందమ్మా.. దాయి దాయి దామ్మా.. నేనో బిచ్చగాన్నమ్మా.. మీరు కోన్ని కోసుకోండమ్మా.. నాకో లెగ్ పీసు వేయండమ్మా.. (ఒక ఇంటి ముందు అరుస్తూ..) బిచ్చగాడు : తల్లీ.. బిచ్చం వేయండి తల్లీ.. బిచ్చం తల్లే.. 1వ లేడీ : ఏరా.. నిన్నెప్పుడూ చూసినట్టు లేదు.. కొత్తగా వచ్చావా ఏంటీ.. బిచ్చగాడు : అవునమ్మా .. ఈ ఊరికి ఫ్రెష్.. ఫ్రెష్‌గా ఉన్నది ఏదైనా పెట్టండమ్మా.. హెల్త్ కరాబవకుండా ఉంటాదీ.. (లేడీ రియాక్షన్) 1వ లేడీ : ముక్కూ మొహం తెలియని వాడికి ఏదైనా మాత్రం ఏలా పెడతాం.. (బిచ్చగాడు రియాక్షన్) బిచ్చగాడు : (లోపల) ముక్కూ మొహం తెలుసుకుని పెట్టడానికి నేనేమైనా ముద్దు పెట్టమన్నానా.. ముద్దే కదా.. బిచ్చగాడు : (పైకి) అమ్మా.. ఇదిగోనండమ్మా నా ఆధార్ కార్డు.. (లేడీ రియాక్షన్) బిచ్చగాడు : ఇదిగోండమ్మా నా రేషన్ కార్డు.. (లేడీ రియాక్షన్) బిచ్చగాడు : ఇదిగోమ్మా నా పాన్ కార్డు.. (లేడీ రియాక్షన్) 1వ లేడీ : పాన్ కార్డు కూడా మేంటైన్‌ చేస్తున్నావంటే బాగానే సంపాదిస్తున్నట్టున్నావురా.. కొందరు బిచ్చగాళ్లు వడ్డీలకు కూడా తిప్పుతారంటా.. నిజమేనా.. నీవూ ఏ మాత్రం వెనకేసావేంటిరోయ్.. బిచ్చగాడు : నా బ్లాక్ మనీ డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి మీరు మాత్రం నాకేం తెలుసు.. (లోపల) నా బొచ్చే.. (లేడీ రియాక్షన్) 1వ లేడీ : (నిష్టూరంగా) ఉహూ... రేపురా.. నీ గురించి ఎంక్వయిరీ చేసి అప్పుడు వేస్తాను బిచ్చం.. వెళ్లు.. (లోపలికి వెళ్ళిపోతుంది) బిచ్చగాడు : గొప్పగొప్ప కళలన్నీ కనుమరుగైపోతున్నాయంటే ఊరికేనా.. మీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కరుంటే చాలమ్మా.. మాలాంటి కళాకారులు అంతరించిపోవడానికి.. (రెండవ ఇంటి ముందు అరుస్తూ..) బిచ్చగాడు : తల్లీ.. ధర్మం తల్లే.. ధర్మం వేయండమ్మా.. 2వ లేడీ : పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తోందిరా.. ఎప్పుడు తిన్నావో ఏమో.. (బిచ్చగాడు రియాక్షన్) బిచ్చగాడు : (బాధగా) అవునమ్మా.. ఇప్పటికే పది ఊర్లు కవర్ చేసి.. కొత్తగా ఈ ఊరు వచ్చాను.. ఇంతవరకూ సరిగ్గా ఎవరూ ఏం పెట్టలేదు.. నడిచి నడిచి అలసిపోయాను.. 2వ లేడీ : అయ్యో.. అంతంత దూరాలు నడవడం అంటే కష్టమేరా.. బిచ్చగాడు : కష్టమే అంటే కష్టమేనమ్మా.. కానీ ఇదో వాకింగ్‌లా ఫీలైతే దీనంత ఇష్టం మరొకటి ఉండదు.. బిచ్చగాడు : ఓ.. షిట్.. నేను వచ్చిన పని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాను.. టాపిక్ ట్రాఫిక్‌లో ఇరుక్కుంది.. (అరుస్తూ.. ) తల్లీ.. ధర్మం తల్లే.. ధర్మం వేయండమ్మా.. 2వ లేడీ : ఆపెహే నీ కాకి గోల.. ఏదొకటి తెస్తానుండు.. బిచ్చగాడు : ఏదొకటి కాదమ్మా.. కాస్తంత హెల్దీపుడ్డే తీసుకుని రండమ్మా.. (లోపలనుండి చాలా రకాలు తీసుకుని వస్తుంది.. వాటిని చూసి లొట్టలు వేస్తాడు..) బిచ్చగాడు : ఆహా... ఇవాళ నాకు విందు భోజనమే.. తొందరగా ఇచ్చేయండమ్మా.. 2వ లేడీ : అరేయ్.. ముందు నాకో విషయం చెప్పు.. ఆవిడ నీకేం ఇచ్చిందిరా.. బిచ్చగాడు : ఆవిడ అంటే ఏవిడమ్మా.. (లేడీ రియాక్షన్) 2వ లేడీ : ఆ పక్కింటావిడ.. బిచ్చగాడు : మీరంటే లేడీ ధర్మ ప్రభువులు కాబట్టి ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు.. నా గురించి ఎంక్వయిరీ చేసి రేపు దానం చేస్తానంది ఆ మహాతల్లి.. (లేడీ రియాక్షన్) 2వ లేడీ : ఆవిడ అలా అందా... అన్నట్టు నేనూ మర్చేపోయారోయ్.. ఇవాళ మంచిది కాదు.. నేనూ రేపే దానం స్టార్ట్ చేస్తాలే.. కాస్త ముందుకు వెళ్లు బాబూ.. (లోపలికి వెళ్లిపోతుంది. ) బిచ్చగాడు : ఓ బిచ్చగాడికి దానం చేయడానికి కూడా మంచి చెడులు ముహూర్తాలు ఉంటాయా.. బిచ్చగాడు వాయిస్ : ఎగ్జామ్‌లో వంద మార్కులు తెచ్చుకుని, ఇంటర్య్వూలో సున్న మార్కులు తెచ్చుకున్నట్టైంది నా పరిస్దితి.. సచిన్ సెంచరీ మిస్సయితే ఎంత బాధపడతాడో, ఫుడ్ జస్ట్ మిస్సయినందుకు నా కడుపు కసితో రగిలిపోయింది. నేను ఇన్ని ఊర్లు తిరిగాను.. ఎక్కడా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేయలేదు.. అసలు వీళ్లిద్దరూ ఎవరు.. ఎవరు.. ఎవరు... ఈ సమాధానం కోసం.. రామయణం, భారతం, భాగవతం, ప్రముఖులకే అర్ధం కానీ ప్రపంచంలోని ఇతర ఫేమస్ బుక్సన్నీ చదివాను.. చివరకు నాకు తెలిసిందేంటంటే.. "వాళ్ళిద్దరూ తోడికోడళ్లని.. ఒకరంటే ఒకరికి పడదనీ.." నేను తెలుగుభాష లెక్క .. ఇక్కడే ఉంటా.. ఎందుకంటే ఢిల్లీలో బెగ్గింగ్ చేసుకోవాలంటే హిందీ, అమెరికాలో బెగ్గింగ్ చేసుకోవాలంటే ఇంగ్లీషు రావాలి.. అవి నాకు రావూ... అందుకే నేను టెంట్ వేసుకుని మరీ ఈ ఊరిలోనే ఉంటా.. కాలం కలిసొస్తే ఈ తోడికోడళ్ల కారణంగానే నేను కోటీశ్వరున్ని అవుతా... (బెగ్గర్ కోటీశ్వరుడు అయినట్టు ట్రాన్స్‌ఫర్మేషన్) TO BE CONT.. బిచ్చగాడు వాయిస్ (అరుస్తూ..) : అమ్మా.. బాబూ.. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైకు, ఒక మంచి కామెంట్ దానం చేయండమ్మా.. అలాగే పదిమందికి షేర్ చేయండమ్మా.. మీకు పుణ్యం వస్తాది. ------------

Comments

Popular posts from this blog