మంచిగుండు తెలుగు కామెడీ షార్ట్ వీడియో || Manchigundu funny video by Bamm...


#telugushortvideo #telugucomedy #funnyvideo ***** మంచిగుండు ****** ( ఒకడు రోడ్డుమీద నిలబడి ఏదో ఆలోచిస్తుంటాడు. టోపీ పెట్టుకుని అటుగా వెళుతున్న రెండవవాడు అతన్ని చూసి అక్కడకు వస్తాడు.) 2 వాడు : మాస్టారు.. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ, బాధ పడుతున్నట్టు ఉన్నారు. ఏమైంది.. 1 వాడు: ఏం చెప్పమంటావయ్యా.. ఈ ప్రక్కింటాయనతో తలనొప్పి రోజురోజుకీ ఎక్కువైపోతుంది.. చెత్తను చెత్త కుండీలోనో, చెత్త బండిలోనో కాకుండా మా ఇంట్లో పడేస్తున్నాడు. చూసి చూసి ఆ కంపును భరించలేక నిన్నొక మంచి మాట చెప్పా, దాంతో నేనేదో అనకూడని మాటేదో అన్నట్టు రచ్చ రచ్చ చేసాడు. 2 వాడు : ఇంతకీ మీరు అన్న ఆ మంచి మాట ఏంటి మాస్టారూ.. 1 వాడు: నలుగురితోనూ మంచిగా వుంటే అయిపోతుందికదా.. 'మంచి గుండు'..అన్నా..అంతే.. 2 వాడు : 'మంచి గుండా'... అయ్యో.. అయ్యయ్యో.. ఎంత మాట అనేసారు మాస్టారూ.. (1 వాడు అర్దం కానట్టు వింతగా చూస్తాడు.) 2 వాడు : తెలుగుభాషలో తెలుగువారికి నచ్చని పదం ఏంటో తెలుసా.. 1 వాడు: తెలుగుభాషలో నాకు నచ్చనిది క్షమించడం..(చిరంజీవి స్టైల్లో) ఇది ఆల్రెడీ ఠాగూర్‌లో చిరంజీవి చెప్పేసాడుగా.. 2 వాడు : అది అవుట్‌డేటెడ్.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో వున్న పదం మంచిగుండు. 1 వాడు: ఏంటయ్యా .. దాంతో అంత ప్రాబ్లం వుందా.. 2 వాడు : అంతకంటే ఎక్కువే మాస్టారూ.. ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందూ వెనుకా ఆలోచించాలి.. 1 వాడు : బిపీ పెంచకుండా విషయం ఏంటో చెప్పయ్యా. 2 వాడు : టెర్రరిస్టు అయినా ఎప్పుడో ఒక్కసారే బాంబు వేసి నష్టం చేస్తుంటారు.. కానీ మీలాంటి వాళ్ళు 'మంచిగుండు' అనే మాటను పదేపదే చెప్పి సమాజానికి ఎప్పుడూ నష్టం చేస్తూనే వుంటారు.. 1 వాడు : ఏందయ్యా.. నేనన్న ఈ చిన్న మాటతో సమాజానికి అంత నష్టమా.. ఎలా.... 2 వాడు : ఈ మధ్యన ఒక తహసీల్దార్ కోటీ పది లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మీకు తెలుసా.. 1 వాడు : ఔ.. న్యూస్ పేపర్లో చదివినా.. 2 వాడు : మీరన్న మంచిగుండు అనేమాట ఆ తహసీల్దార్ పాటించి ఉంటే, ఆయన లైఫ్ మొత్తంలో అంత డబ్బు సంపాదించేవాడా.. (1 వాడు రియాక్షన్.) 2 వాడు : ఆయనెవరో అడిషనల్ కలెక్టరటా.. కోటీ పన్నెండు లక్షలు లంచం డిమాండ్ చేసాడు. ఒక ఏసీపీ వంద కోట్ల‌కు పైగా అక్ర‌మ ఆస్తులు కూడబెట్టాడు.. ఒక రాజకీయ నాయకుడైతే లక్ష కోట్లు సంపాదించినట్టు వార్తలు వచ్చాయి.. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. లక్షల్లో వున్న వీళ్లంతా మీరన్న ఒక్కపదం 'అందరితోనూ మంచిగుండు' ఫాలో అయివుంటే ఎంతెంత నష్టపోయేవారు.. 1 వాడు :నిజమేనయ్యా .. నీవు చెప్పింది నూటికీ నూటయాభై శాతం రైటే.. పాపం, కేవలం చెత్త వేస్తున్నందుకే 'మంచిగుండు' అనే సరికి మా ప్రక్కింటాయన బాగా ఫీలయినట్టున్నాడు. 2 వాడు : అంతెందుకు మాస్టారూ.. ప్రక్కింటాయన రోజూ మీ ఇంట్లో చెత్త వేస్తున్నా.. మీ వాళ్లను ఒక్కసారైనా వాళ్లింట్లో చెత్త వేయనిచ్చారా.. 1 వాడు : అమ్మా... ఎందుకు వేయనిస్తా..... అందరితోనూ 'మంచిగుండు' అని వాళ్లకు చెప్పినా.. 2 వాడు : చూసారా.. మీరు అన్న ఈ ఒక మాట కారణంగా వాళ్లు కిలోమీటరు దూరం నడిచి వెళ్ళి చెత్తను పడేస్తున్నారు.. అదీ మిమ్మల్ని తిట్టుకుంటూ .. మీ ఇంట్లో వాళ్లనే ప్రశాంతంగా ఉంచలేని మీరు ఇక సమాజాన్ని ఏం ప్రశాంతంగా ఉంచాతారు.. (1 వాడు రియాక్షన్.) 1 వాడు : నిజమే ... నేనన్న మాటలో ఎంత నేరమూ, ఘోరమూ వుందో ఇప్పుడు తెలిసింది.. ఇంకెప్పుడూ అలాంటి మంచి మాటలు మాట్లాడి ఎదుటి వారిని అస్సలు హర్ట్ చెయ్యను.. అవునూ, నిన్నెప్పుడూ చూసినట్టులేదు.. ఇంతకీ నీవెవరూ.. (టోపీతీసి నున్నటి గుండుమీద చేత్తో రాస్తూ.. ) 2 వాడు : మంచిగుండు.. (అని నవ్వుకుంటూ వెళ్లిపోతాడు.)

Comments

Popular posts from this blog