రంగడు మాయాపులి || Magical Tiger and Rangadu @BAMMA KATHALU


#రంగడుమాయాపులి #magicaltigerandrangadumoralstory #panchatantrakathalu #bedtimestories ************* రంగడు-మాయాపులి ************ నారాయణపురంలో రంగడు అని ఒకడు ఉండేవాడు. వాడి బుర్రలో తెలివి శూన్యం. అందుకని వాడిచేత రకరకాల పనులు చేయించుకునేవారు. అయినా వాణ్ణి ఎవ్వరూ గౌరవించేవారు కాదు. పని బాగా చేయకపోతే ఒకటికి పది మాటలని తిట్టేవారు. పని బాగా చేస్తే ‘‘ఈరోజు నీకేమైందిరో, ఇంత బాగా చేశావు’’ అని వేళాకోళం చేసేవారు. ఊళ్లో రంగడు కనబడితే చాలు పెద్దవాళ్లు ఏదో మాట అని నవ్వేవారు. చిన్నపిల్లలైతే ఏదో కోతిని చూసినట్లు చూసి వెక్కిరించి ఏడిపించి వినోదించేవారు. ఎవరి జోలికీ వెళ్లకపోయినా, అంతా తనని పనిగట్టుకుని మరీ ఎగతాళి చేస్తుండడం రంగడికి చాలా బాధగా ఉండేది. అందుకు కారణం తనని వాళ్లు తెలివితక్కువవాడని అనుకోవడమేనని వాడు గ్రహించాడు. ఊళ్లో అందరితోపాటు సమానంగా గౌరవం పొందుతూ, వాళ్లలో ఒకడుగా కలిసి బ్రతకాలని వాడికి ఉండేది. ఆ కోరిక తీరాలంటే తను తెలివైనవాణ్ణని అంతా గుర్తించాలి. అది ఈ జన్మలో జరిగే పనికాదు. రంగడికి జీవితమంటే విరక్తి పుట్టింది. ఒకరోజున, ‘‘నాదీ ఓ జీవితమేనా? ఇలా బ్రతకడంకంటే చావడమే మేలు’’ అనుకున్నాడు. చావడానికి మొదటి ప్రయత్నంగా, రంగడు ఊరు చివర ఉన్న కొండ ఎక్కాడు. అక్కడినుంచి దూకాలనుకుని క్రిందకు చూస్తే, కొండ క్రింద పొడవునా పెరిగిన దట్టమైన చెట్లు కనిపించాయి. " సరాసరి క్రిందపడకుండా శరీరం ఆ చెట్లకు తగులుకుంటే, ప్రాణం పోదు సరికదా, నా ఒళ్లంతా గాయాలై ఏ కాలో చెయ్యో విరగొచ్చు. అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నప్పుడే అంతా నన్ను ఎగతాళి చేసే ఊరివాళ్లు వంకరలుంటే ఊరుకుంటారా" అని భయపడ్డాడు. తర్వాత రంగడు ఆ కొండపక్కనే ప్రవహిస్తున్న నదిలో కలిసిపోవాలనుకున్నాడు. నదిలో దూకి పీకలోతుదాకా వెళ్లేసరికి వాడు తనకు తెలియకుండానే ఈత కొట్టుకుంటూ ఒడ్డుకి వచ్చేశాడు. ‘‘నా చేతులతో నా ప్రాణాలు తీసుకోవడం నావల్లకాదు. ఐనా ఊళ్లో చస్తే అంతా నా శవాన్నిచూసి వేళాకోళంగా నవ్వుకుంటారు. కాబట్టి కొండకి అటుప్రక్కన ఉన్న అడవికి వెళతాను. అక్కడ ఏ పులో నన్ను చంపి తినెయ్యకపోదు. అప్పుడు నా చావుగురించి ఎవరికీ తెలియదు. పైగా ఓ జంతువు ఆకలి తీర్చడంవల్ల అంతో ఇంతో నాకు పుణ్యమైనా దక్కుతుంది’’ అనుకున్నాడు. అలా రంగడు చావాలన్న పట్టుదలతో అడవికి వెళ్లాడు. కొంతదూరం వెళ్ళాక వాడికి పెద్దపెట్టున పులి గాండ్రింపు వినబడింది. వెనక్కి తిరిగితే వేగంగా దూకుతూ తనవైపే వస్తున్న పెద్దపులి కనిపించింది. మామూలు పరిస్థితుల్లో అయితే వాడు భయంతో అక్కణ్ణించి పరుగెత్తేవాడే! కానీ చావాలన్న కోరిక బలంగా వుండటం వల్ల వాడు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. కానీ పులిని చూడ్డానికి భయమేసి కళ్ళు మూసుకున్నాడు. పులి వాడికి కొంచెం దగ్గరగా వచ్చింది. కదలకుండా శిలావిగ్రహంలా నిల్చున్న రంగడిని చూసి, ఆగి మరొకసారి గాండ్రించింది. అయినా రంగడిలో చలనంలేదు. ‘‘వచ్చే జన్మలోనైనా నారాయణపురంలో ప్రజలందరూ నన్ను గౌరవించేటంత తెలివిని నాకు ప్రసాదించు దేవుడా!’’ అని మననులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు. పులి పంజా విసురుతుందనీ మానసికంగా సిద్ధపడిన రంగడికి, ఎంతకీ ఏం కాకపోవడంతో, ఆశ్చర్యపడి కళ్ళు తెరిచాడు. అప్పుడు వాడితో పులి చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఇలా అంది. ‘‘ నేను మాయాపులిని.. వేటగాళ్ళు, కలప దొంగల నుంచి ఈ అడవిని కాపాడేందుకు వనదేవత నన్ను సృష్టించింది. నా గాండ్రింపు విని మనుషులెవరూ ఇటుగా రారు. ఇన్నాళ్లకు నువ్వొక్కడివే నా గాండ్రింపుకి భయపడలేదు. ఇక్కణ్ణించి పారిపోలేదు. కుతూహలంకొద్దీ దివ్య దృష్టితో నీ కథ తెలుసుకున్నాను. నాకు నిన్ను చూస్తే జాలిగా ఉంది. నీకు సాయపడతాను..’’ అంటూ దివ్యశక్తిని వాడికి ప్రసాదించింది ఆ పులి. " ఇకనుంచి నీవు తెలివైనవాడివే కాదు, నీకు ఎలాంటి రోగాలనైనా తగ్గించగల అద్భుతశక్తి ఉంటుంది’’ అన్నదా పులి. దానికి రంగడు చాలా ఆనందపడి, ‘‘మీ దయవల్ల నా అదృష్టం పండింది. వెంటనే మాఊరికి తిరిగివెళ్లి, నా శక్తిని ప్రదర్శించి వాళ్ల గౌరవమన్ననలు పొందుతాను’’ అన్నాడు. " పుట్టిన ఊరు కాబట్టి నీకు నారాయణపురం అంటే మక్కువ ఉండొచ్చు. కానీ ఆ గ్రామస్థులు మూర్ఖులు. నీకు తెలివి లేదు కాబట్టి ఇంతకాలం వాళ్లను భరించగలిగావు. ఇక మీదట నీకు అక్కడ బ్రతుకు దుర్భరమౌతుంది. ఇప్పుడు నీతో సమానమైన తెలివైనవాళ్లు ధర్మాపురంలో ఉన్నారు. అక్కడి ప్రజలకు నీ అద్భుత శక్తులతో వైద్యం చేసి సహాయపడు’’ అని చెప్పి ఆ మాయాపులి మాయమైపోయింది. ఆ పులి మాటలు తనకు శిరోధార్యం కనుక రంగడు ధర్మాపురం వెళ్లాడు.

Comments

Popular posts from this blog