మాయా వింత జంతువు తెలుగు కథ || Magical strange animal vs wild animals Mor...


#Telugumoralstory #moralstory #grandmastories
************* మాయా వింత జంతువు. *********** అడవిలో పెద్ద మాయా వింత జంతువు ఒకటి ఉండేది. అది చూడటానికే చాలా భయంకరంగా ఉండేది. అప్పుడప్పుడూ గాలిలో ఎగురుకుంటూ వచ్చి దొరికిన జంతువును ఎత్తుకు పోయేది. (జింక, ఏనుగు, కోతీ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాయి. మాయా వింత జంతువు ఎగురుకుంటూ రావడం.) జింక : అమ్మో.. ఆ భయంకరమైన వింత జంతువు ఇక్కడికే వస్తుంది. పారిపోండీ.. పారిపోండీ.. (జింక, ఏనుగు, కోతీ పరుగులు పెట్టడం.. వింత జంతువు కొంతదూరం వెంబడించి.. జింకను పట్టుకుని గాల్లోకి లేస్తుంది. పరుగులు పెడుతున్న ఏనుగు, కోతిని చూసి గట్టిగా నవ్వుతూ..) మాయా వింత జంతువు : వెళ్లండీ.. వెళ్ళండీ.. ఏదో ఒకరోజూ మీరూ నాకు ఆహారం కాక తప్పదు.. అలా ఎత్తుకు పోయిన జంతువును ఒక పెద్ద గుహ లోపలికి పట్టుకుని పోయి.. మాయా జంతువు, అక్కడే ఉండే మరో ముసలి గ్రద్ద తినేసేవి. (మేకను ఎత్తుకుని పోతుంది.) (గాడితను ఎత్తుకుని పోతుంది.) ఈ మాయా వింత జంతువు అడవిలోకి ఎలా వచ్చిందంటే.. ఒకప్పుడు అడవిలో దుష్ట నక్క ఒకటి ఉండేది. దాని బుద్ది అస్సలు మంచిది కాదు. తన తోటివారు సంతోషంగా ఉంటే భరించలేకపోయేది. ఒక జంతువు గురించి మరొక దానికి లేనిపోనివి కల్పించి చెప్పి, వాటి మధ్య బాగా గొడవలు పెట్టేది. దాంతో అవన్నీ కొట్టుకునేవి. అది చూసి నక్క తెగ సంబరపడేది. తరువాత తరువాత తాము కొట్టుకోవడానికి అసలు కారణం ఆ జిత్తులమారి నక్కే అని తెలుసుకున్న జంతువులన్నీ దానికి దేహశుద్ది చేసి అక్కడి నుండి తరిమేసాయి. తరువాత ఆ నక్క అక్కడి నుండి పారిపోయి తలదాచుకునేందుకు ఒక గుహలోకి చేరింది. అదే గుహలో ముసలి గ్రద్ద ఒకటి ఉంది. దానికి తన కథనంతా చెప్పుకుంది. ముసలి గ్రద్ద : నీవేం బాధపడకు మిత్రమా.. నేను నీలాంటి వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నాను. నా దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి. వాటితో నిన్ను మాయా వింత జంతువుగా మార్చేస్తాను.. నీవు ఎగురుకుంటూ వెళ్లి ఆ జంతువులపై ప్రతీకారం తీర్చుకో. కాకుంటే నీవు వేటాడిన జంతువులో సగభాగం నాకు ఇవ్వు.. అలా 21 జంతువులను తిన్న తరువాత నా ముసలితనం పోయి, శక్తివంతమైన పడుచు మాయా గ్రద్దగా మారతాను. ఆ మాటలకు నక్క సంతోషంగా అంగీకరించడంతో ముసలి గ్రద్ద తన మహిమతో నక్కను మాయా జంతువుగా మార్చేసింది. (నక్క మాయా వింత జంతువుగా మారడం.) ఆ నాటి నుండి వింత జంతువుగా మారిన నక్క, కోపంతో అడవిలో ఉన్న జంతువులపై దాడి చేయడం మొదలుపెట్టింది. (ఏనుగును ఎత్తుకుని పోతుంది.) (సింహాన్ని ఎత్తుకుని పోతుంది.) ఒకనాడు ఆ వింత జంతువు వెనుకే వెళ్లిన ఎలుగుబంటి గుహలో జరుగుతున్న విషయాన్నంతా చాటుగా గమనించింది. కొంతసేపటికి ఆ జంతువు బయటకు వెళ్ళిన తరువాత ముసలి గ్రద్దపై దాడి చేసి దానిని చంపేసింది. దాంతో గాలిలో ఎగురుతున్న మాయా వింత జంతువు కాస్తా నేలమీద పడి, నక్కలా మారిపోయింది. నక్క : అయ్యో.. నేను మళ్లీ పాత రూపంలోకి మారిపోయానే.. శక్తి మొత్తం పోయిందే.. ఇప్పుడేం చేయాలీ.. అప్పుడే నక్కను జంతువులన్నీ చుట్టుముట్టాయి. తను గుహలో చూసినదంతా ఎలుగుబంటి చెప్పడంతో అవన్నీ కోపంతో నక్కపై దాడి చేసాయి. వాటి నుండి తప్పంచుకోవడానికి పరుగులు పెట్టిన నక్క అనుకోకుండా నదిలో దూకింది. ప్రవాహంలో కొట్టుకునిపోయి చనిపోయింది. ఆ విధంగా దుష్టనక్క బాధ తప్పిపోవడంతో అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి. అందుకే అంటారు "చెడు ఆలోచనలు మనకు ఎప్పుడూ నష్టాన్నే తెస్తాయనీ.."

Comments

Popular posts from this blog