గుండు దెయ్యం తెలుగు కథ || Gundu Deyyam Telugu comedy story by bamma kathalu


#gundudeyyam #telugustories #horrorstories ************ గుండు దెయ్యం-1 ********** ఒకానొకప్పుడు సోము, దాము అనే ఇద్దరు గజదొంగలు ఉండేవారు. వాళ్ల కన్ను పడిందంటే చాలు, ఎంతమంది కాపలాకాసే ఇల్లయినా సరే గుల్ల అయిపోవాల్సిందే. (ఒక భవంతి గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. దొంగలు వెనుకగా గోడకు రంధ్రం చేసి, వెళ్ళి దొంగతనం చేయడం. హేపీ రియాక్షన్.. ) అలా హాయిగా దొంగతనం చేసుకుంటూ దర్జాగా బతుకుతున్న వారికి ఇప్పుడు ఓ కొత్త కష్టం వచ్చి పడింది.. అదేమిటంటే.. వాళ్లను ఓ గుండు దెయ్యం పగబట్టింది. వెంటపడి వెంటపడి మరీ ఇబ్బందులు పెడుతోంది. రాత్రయిందంటే చాలు మంచి ఉద్యోగానికి వెళుతున్నట్టు ఆనందంగా దొంగతనానికి వెళ్లే వారిలో ఇప్పుడు భయం పట్టుకుంది. (చీకటిలో దొంగలు వణుకుతూ ఉంటారు.) సోము : రేయ్.. ఇవాళ కూడా ఆ గుండు దెయ్యం వస్తుంది అంటావా.. దాము : ఏమో నాకు మాత్రం ఏం తెలుసు.. దానిని తలుచుకుంటేనే కాళ్లూ చేతులూ వణికిపోతున్నాయి.. గుర్తుచేయకురా బాబూ.. సోము : రాత్రిపూట దొంగతనం మానేసి పగటివేళ దొంగతనాలు చేసుకుంటే మంచిదేమోరా.. దాము : ఇప్పుడు దెయ్యం చేతిలోనే దెబ్బలు తింటున్నాం.. అప్పుడు ఈ చుట్టుప్రక్కల ఊరి వాళ్లందరితోనూ చావు దెబ్బలు తినాలి.. మాట్లాడకుండా మౌనంగా పదా.. ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి, ఓ ఖరీదైన బంగ్లా గేటు దూకి లోపలికి వెళ్లారు. అక్కడ అరల్లో కనిపించిన డబ్బు, బంగారం చూసి ఆశ్చర్యపోయారు. వాటిని వేగంగా తమ వెంట తెచ్చుకున్న సంచుల్లో నింపడం మొదలుపెట్టారు. అప్పుడే గుండు దెయ్యం గాల్లో ఎగురుకుంటూ ఆ బంగ్లా దగ్గరకు వచ్చింది. దెయ్యం : ఓహో.. మీరు లోపల ఉన్నారా.. వస్తున్నా.. వస్తున్నా.. మీ సంగతి చెబుతా.. గట్టిగా నవ్వి బంగ్లా లోపలికి వెళ్లింది. మొత్తం డబ్బు, నగలను సంచుల్లో నింపుకుని వెళ్లిపోతూ వెళ్ళిపోతూ ఆ దొంగలు.. టేబుల్‌ మీద ఉన్న రకరకాల ఆహర పదార్ధాలను చూసారు. వారు అన్ని రకాల ఆహార పదార్దాలను ఇంతవరకూ చూడనేలేదేమో ఒక్కసారిగా నోరూరింది. ఇద్దరూ తిందామని అక్కడకు వెళ్లారు. (కుర్చీలు తిరగబడతాయి.. కొన్ని వస్తువులు అటూఇటూ జరుగుతుంటాయి.. ఆహార పదార్దాలు గాల్లో ఎగురుతూ ఉంటాయి.. వింత వింత శబ్దాలు.. వాళ్ల రియాక్షన్స్.. ) వాళ్లకు ఆ గదిలో ఓ మూల కూర్చుని దెయ్యం కనిపించింది. దానిని చూస్తూనే వాళ్లకు చెమటలు పట్టేసాయి.. సోము : అమ్మో.. ఆ దెయ్యం వచ్చేసింది... పారిపోదాం పదరోయ్.. (ఇద్దరూ పరుగులు పెడతారు.. అటూఇటూ పరుగులు పెట్టి రకరకాల వస్తువులను గుద్దుకోవడం.. ) సోము : నేను ముందుకు వెళ్లలేకపోతున్నాను.. దాము : నా కాళ్లు ఊడిరావడం లేదు.. (దెయ్యం దగ్గరకు రివర్స్‌లో సీలింగ్‌కి వేలాడటం.. ) సోము : దె.. దెయ్యం మేడం.. ఇంతకు ముందు మీరు పోలీస్‌గా పని చేసినట్టున్నారు.. అందుకే దొంగలైన మా పనిపడుతున్నారు.. దాము : ఇప్పుడు మమ్మల్ని వదిలిపెడితే బుద్దిగా మంచిపని చూసుకుంటాం.. దెయ్యం : నేను పోలీసును కాదురా.. మీ శత్రువునీ.. మిమ్మల్ని పగబట్టాను.. సోము : పాములు పగబడతాయని విన్నాం.. దెయ్యాలు కూడా పగబడతాయా మేడాం.. దాము : మేమేదో చిన్నచిన్న దొంగతనాలు చేసుకునే చిల్లరగాళ్లం.. మేం నీకేం అపకారం చేసాం మేడాం.. దెయ్యం : మీరు నా ఆశలను చంపేశారు.. నా ఇష్టాలను నాశనం చేశారు.. జీవితాన్ని సర్వనాశనం చేసారు.. (ఒక అందమైన అమ్మాయి ఇంట్రడక్షన్.. కూర్చుని కన్నీళ్లు.. sentiment..) (బంగ్లా బయట..) దెయ్యం వాయిస్ : అందుకే పగబట్టానురా.. మిమ్మల్ని వదిలిపెట్టను.. (దెయ్యం నవ్వు..) ---- to be continued ----

Comments

Popular posts from this blog