నిజాయితీకి సరైన బహుమతి నీతి కథ - Chandamama kathalu - 3D grandma tales ...


#bedtimestories #moralstories #panchatantrastories ************ నిజాయితీకి సరైన బహుమతి. ************* రంగనాధపురంలో శివుడూ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. తండ్రి లేకపోకడంతో అన్నీ తానై చూసుకుని తల్లి సుగుణమ్మ అతడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది. శివుడికి మాత్రం లోకజ్ఞానం పూర్తిగా అబ్బలేదు. దాంతో వాడు ఎలా బతుకుతాడా అని రోజూ ఆమె దిగులు చెందేది. ఒకసారి సుగుణమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. కొడుకుకు బ్రతకడానికి ఒక మార్గం చూపే సమయం తనకికి లేదు.. కనీసం ఒక మంచి విషయం అయినా చెప్పాలనుకుంది.. శివుడిని దగ్గరకు పిలిచి.. " జీవితంలో ఎప్పుడూ అబద్దం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి.." అని చెయ్యి చాచి అడిగింది. " సరేనమ్మా.. ఇకమీదట నేను ఎప్పుడూ అబద్దం చెప్పను.." అని తల్లి చేతిలో చెయ్యివేసి ప్రమాణం చేశాడు శివుడు. ఒకరోజు పనిమీద పట్నానికి బయలుదేరాడు శివుడు.. రంగనాధపురం నుంచి పట్నం వెళ్లాలంటే మధ్యలో కొంత అడవీ ప్రాంతం వుంటుంది. శివుడు అడవి దారిగుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో ఇద్దరు దోపిడీ దొంగలు వేగంగా వచ్చి అతడిని చుట్టుముట్టారు. ఊహించని ఈ చర్యకు శివుడు భయపడ్డాడు.. దొంగలలో ఒకడు " నీ దగ్గర ఏం ఉన్నాయి.." అని గట్టిగా అడిగాడు.. చెబితే తన దగ్గర ఉన్నవి దోచుకుంటారని తెలిసినా తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివుడు. " నా దగ్గర పది వరహాలు ఉన్నాయి." అని చెప్పాడు. దొంగలు ఇద్దరూ అతని జేబులు వెతికారు. కానీ ఏమీ దొరకలేదు. వాళ్లు మరుమాట్లాడకుండా వెళ్లిపోతుంటే, దొంగల్ని వెనక్కి పిలిచాడు. .. " నా దగ్గర నిజంగానే పది వరహాలు వున్నాయి.. వాటిని నేను నా రహస్య జేబులో దాచాను.. అవి మీకు కనపడలేదు.." అని వాటిని బయటకు తీసి .. "ఇదిగో తీసుకోండి.." అంటూ ఆ సొమ్మును వారికి ఇవ్వబోయాడు. శివుడి చర్యకు దొంగలిద్దరూ ఆశ్చర్యపోయారు. అతడి నిజాయితీకి సంతోషపడి, మెచ్చుకున్నారు.. " మేము మామూలు దొంగలం కాదు.. అన్యాయంగా డబ్బులు సంపాదించిన వారి దగ్గర దోచుకుని .. పేదవాళ్లకు సహాయం చేస్తాం.. చూస్తుంటే నీవు కష్టాల్లో ఉన్నట్టున్నావు.. ఈ వంద వరహాలు కూడా తీసుకో .." అని వాళ్ల దగ్గర వున్న సొమ్మును బహుమానంగా ఇచ్చి వెళ్లిపోయారు. తన తల్లి ఎప్పుడూ నిజమే చెప్పాలని ఎందుకు చెప్పిందో శివుడికి అప్పుడు అర్ధం అయింది. తర్వాత ఆనందంగా పట్నం వైపు నడక కొనసాగించాడు. ఈ కథలో నీతి ఏమిటంటే.. " నిజం చెప్పిన వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. https://youtu.be/qXIRLWaRA1c

Comments

Popular posts from this blog