చెట్టు మీద దెయ్యం నాకేం భయం || Chettumeeda deyyam nakem bhayam telugu st...


#deyyam #telugustory #moralstory *************** చెట్టు మీద దెయ్యం నాకేం భయం. *********** ఒక ఊళ్ళో రాము అనే అబ్బాయి వుండేవాడు. ఆ కుర్రవాడు చాలా తెలివైనవాడు. ఎవరు ఎన్ని రకాలుగా భయపెట్టాలని చూసినా అస్సలు భయపడేవాడు కాదు.. పైగా "ఓస్‍ అంతేగదా" అనేవాడు. ఒకసారి అడవిలో చెట్టుమీద ఉండే దెయ్యం వచ్చి ఊరి మీద పడింది. దానిని దూరం నుంచీ చూసి ఊళ్ళో అందరూ భయంతో అరుచుకుంటూ పారిపోయారు. కానీ రాము ఆలస్యంగా నిద్ర లేచేసరికి దెయ్యం ప్రతి ఇల్లూ వెదుకుతోంది. తినడానికి మనుషులు గాని, ఏదైనా భోజనం గానీ దొరుకుతుందేమోనని ప్రతిచోటా గాలిస్తోంది. ఈ లోగా తెలివైన అబ్బాయి రాము కొన్ని మాడిపోయిన రొట్టెలు దగ్గర పెట్టుకున్నాడు. అవి చూడటానికి అచ్చం రాళ్ళలాగ కనిపిస్తున్నాయి. దెయ్యం అక్కడికి వచ్చింది. "ఏయ్‍ అబ్బాయ్‍.. ఏం చేస్తున్నావ్‍? నన్ను చూసి కూడా భయపడటం లేదు.. ఏం?" అన్నది. "భయమా?.. దేనికి?.. చెట్టు మీద దెయ్యం నాకేం భయం.." అంటూ పాట అందుకున్నాడు రాము. "తమాషాగా ఉందా.. నా అంత బలం నీ దగ్గర వుందా ఏం?" అని కోపంగా అడిగింది. "ఇదిగో చూద్దువు గాని నా బలం" అంటూనే అక్కడ రాళ్ళలాగ కనిపిస్తున్న రొట్టెల్ని కరకరా తినేశాడు. "అదేంటి రాళ్ళని తింటున్నావ్‍?" అన్నది దెయ్యం. "అవును.. రాళ్ళు తినడం నాకు చాలా ఇష్టం.. నాకు ఆకలి బాగా వేసినప్పుడు పెద్ద పెద్ద కొండల్ని కూడా తింటాను.." అన్నాడు ధైర్యం నటిస్తూ. దాంతో దెయ్యం ఆశ్చర్యపోయింది. అది చూసి తెలివైన అబ్బాయికి ఇంకో ఆలోచన వచ్చింది. "నీకు చాలా శక్తి ఉంటే నే చెప్పినట్టు నడవాలి. సరేనా?" అని అడిగాడు. "ఆ నడుస్తా.. కానీ అలా నడిచేకా నిన్ను మింగి తినటం ఖాయం" అన్నదా దెయ్యం. "ఓస్‍ అంతేగదా" అంటూ అక్కడ తను ఆటలో గెలుచుకున్న బోలెడు గోళీలు పరిచాడు. "వీటి మీద నడు" అన్నాడు. "అంతేనా?.. ఇందులో కష్టం ఏముందీ" అంటూ గోళీల మీద తన పెద్ద శరీరంతో నడవబోయింది. గోళీలు కదిలి, దాని కాళ్ళు జారి అమాంతం ధబేల్‍మని కిందపడింది. అంతే దాని నెత్తి మీద రెండు కొమ్ములు విరిగిపోయాయి. "నీ తల మీద కొమ్ములు విరగ్గొట్టాను.. నీ నాలుక కూడా కోసేస్తా వుండు.. ఏదీ కత్తి" అంటూ దెయ్యం ముందు హడావిడి చేసాడు. దాంతో మొదటిసారి భయపడిన దెయ్యం.. "వీడు నా నాలుక కోసినా కోయగలడు.. వెంటనే తప్పించుకోవాలి.." అని మెల్లిగా లేచి అబ్బాయికి కనబడకుండా వేగంగా పారిపోయింది. ఆరోజు నుంచి దెయ్యం ఆ ఊరి వైపు రావడం మానేసింది. తెలివైన అబ్బాయి రాము సాహసానికి ఆ చుట్టుప్రక్కల ఊరివాళ్లంతా ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే.. "భయపడి కూర్చుంటే ఏ పని చేయలేము."

Comments

Popular posts from this blog