RGV Making fun with Anchor || RGV Latest Interview || RGV with Mr Lavangam


#rgv #rgvlatestinterview #rgvinterview RGV Making fun with Anchor || RGV Latest Interview || RGV with Mr Lavangam
ఈయన "రాం గోపాల్ వర్మ" కాదు

యాంకర్ : మిస్టర్ లవంగం వ్యూవర్స్‌ అందరికీ కూడా నమస్కారం.. ఈ రోజు ఇంటర్‌వ్యూలో స్పెషల్ గెస్ట్ .. రక్తాన్ని రుచి చూసి, దెయ్యంతో దోస్తీ చేసి, ఎప్పుడూ సన్షేషన్ కోరుకునే ఫేమస్ డైరెక్టర్ "రాధా గోపాల్ వర్మ.. " (ఆర్జీవీ ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) యాంకర్ : హాయ్ ఆర్జీవీ గారూ.. (ఆర్జీవీ కళ్లతో యాంకర్‌ని చూసి, వెంటనే ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) యాంకర్ : హాయ్ ఆర్జీవీ గారూ.. (ఆర్జీవీ ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) యాంకర్ : హాయ్ ఆర్జీవీ గారూ.. (ఆర్జీవీ ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) యాంకర్ : ఏంటి సార్.. నేను అన్నిసార్లు గొంతు చించుకుని 'హాయ్' చెబితే మీరు కనీసం రిప్లై ఇవ్వడం లేదు. ఆర్జీవీ : నేను ఇచ్చాను.. నువ్వే క్యాచ్ చేయలేదు. (ఆర్జీవీ ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) (యాంకర్‌ ఆశ్చర్యపోయి..) యాంకర్ : ఇచ్చారా.. ఎప్పుడూ ఎలా..? ఆర్జీవీ : నేను ఒకసారి కళ్ళు పైకెత్తి నిన్ను చూసాను.. అదే నా సమాధానం.. యాంకర్ : అంటే కళ్ళతోనే 'హల్లో' చెప్పారన్నమాట. ఆర్జీవీ : ఎస్.. ఎస్.. (ఆర్జీవీ ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) యాంకర్ : సార్ .. వీడియో గేమ్స్ ఇంటికి వెళ్ళాకా ఆడుకోవచ్చు.. ముందు మా వ్యూవర్స్‌ని చూస్తూ మాట్లాడండి.. ఆర్జీవీ : ఇవి వీడియో గేమ్స్ అనుకున్నావంటే, నీ వయసు పెరిగినా బ్రెయిన్ పెరగలేదని నాకు అర్ధంఅయింది. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : ఇంతకీ ఎలా ఉన్నారు.. ఆర్జీవీ : బాలేదు.. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : వాట్ ..! బాలేదా.. అదేం సమాధానం సార్.. ఆర్జీవీ : ముందు మీరెలా ఉన్నారో చెప్పండి.. యాంకర్ : ఐయామ్ ఫైన్.. నేను చాలా బావున్నాను. ఆర్జీవీ : మీరు బావున్నారు కాబట్టే నేను బాలేదు.. ఎదుటివారు ఎలా ఉంటే అలా ఉండటం నాకు ఇష్టం ఉండదు.. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : సార్ .. ప్రతీ డైరెక్టరూ సినిమా తీయాలంటే స్టోరీ డిష్కషన్, కేస్టింగ్ సెలక్షన్, మ్యూజిక్ సిట్టింగ్స్, లొకేషన్స్ ఫైనలైజ్ అంటూ సంవత్సరాలకు సంవత్సరాలు తీసుకుని నానా కష్టాలు పడుతుంటారు. మీరేంటి సార్.. సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసారో తెలియదు, ఒకేసారి ఐదారు సినిమాలు రిలీజ్ చేస్తారు. అదెలా సాధ్యం.. ఆర్జీవీ : నాకు సినిమా తీయడం అంటే ఓడ్కా తాగినంత ఈజీ.. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : వరుసగా ఫ్లాప్ సినిమాలు తీసున్నారు.. ఒక హిట్ సినిమా తీయెచ్చుకదా.. ఆర్జీవీ : హిట్ సిన్మా తీయడం నాకు చేతకాదు. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : అదేంటి సార్ .. మొదట్లో అన్నీ హిట్లే ఇచ్చారు కదా.. ఆర్జీవీ : అవి హిట్లవుతాయని నాకు తెలియదు.. కుదిరితే మళ్లీ తీసి వాటిని ఫ్లాప్ చేస్తా.. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : టాలీవుడ్ సినిమాలు తీసినప్పుడు ఫాక్షన్ వాళ్లు, బాలీవుడ్ సినిమాలు తీసినప్పుడు మాఫియావాళ్లు .. మిమ్మల్ని చంపుతామని బెదిరించారు కదా.. అప్పుడు మీకు భయం వేయలేదా.. (ఆర్జీవీ పగలబడి నవ్వుతాడు.) యాంకర్ : ఎందుకుసార్ నవ్వుతున్నారు. ఆర్జీవీ : నా జీవితంలో ఇదే బెస్ట్ జోక్.. (ఆర్జీవీ పగలబడి నవ్వుతాడు. యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : అదేంటీసార్ .. మీకసలు భయం అనేదే లేదా.. ఆర్జీవీ : కొట్టేవాడు, చంపేవాడు ఎప్పుడూ చెప్పి చెయ్యరు. (ఆర్జీవీ పగలబడి నవ్వుతాడు. యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : పోనీ కరోనాకి భయపడ్డారా.. ఆర్జీవీ : (పాటలా పాడుతూ) కరోనా ఒక పురుగు.. కరోనాయే నన్ను చూసి భయంతో గజగజ వణికి పారిపోయింది. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : మీరు దేవుడిని నమ్ముతారా.. ఆర్జీవీ : దెయ్యాన్ని నమ్ముతాను.. ఐలవ్ డెవిల్.. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : దేవుడిని ఎందుకు నమ్మరుసార్. ఆర్జీవీ : మీరు నమ్ముతారు కాబట్టి.. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : అయితే మేము చేసే పనులేమీ మీరు చేయరా.. ఆర్జీవీ : ఖచ్చితంగా చేయను.. చేస్తే ఈ జీవిని మీరు ఇంటర్‌వ్యూ చేసేవారు కాదుకదా.. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : ఆఫ్ ద స్క్రీన్ మీరు చాలా సరదాగా ఉంటారంటా.. మీకిష్టమైన జోకర్ ఎవరుసార్.. ఆర్జీవీ : కె ఎ పాల్.. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : అదేంటిసార్... ఆయన ప్రపంచశాంతి కోసం అంతలా ఫైట్ చేస్తుంటే, మీకు జోకర్‌లా కనిపించడమేంటీ.. ఆర్జీవీ : చెప్పానుగా నేను మీలా ఉండను.. మీలా ఆలోచించననీ.. (యాంకర్‌ రియాక్షన్..) యాంకర్ : ఇంతకీ 'రాధా గోపాల్ వర్మ' ఇంటిలిజెంటా.. ఇన్నోసెంటా..? ఆర్జీవీ : రెండూ కాదు .. యాంకర్ : మరీ.. ఆర్జీవీ : మూర్ఖుడు.. నేను ఎవడి మాటా వినా.. నాకు నచ్చినట్టు నే వుంటా.. యాంకర్ : చివరిగా.. మిస్టర్ లవంగం వ్యూవర్స్‌కి ఏదైనా మెసేజ్ ఇవ్వండీ.. ఆర్జీవీ : మెసేజ్‌లు నేనిచ్చేదేంటీ.. వాట్సాప్, ఫేస్‌బుక్కుల్లో ఉంటాయి.. వెతుక్కోమనండి.. నీ భాషలోనే నేను వీడియో గేమ్స్ చూసే టైం అయింది .. నే వస్తా... (వెళ్ళిపోతున్న ఆర్జీవీని, యాంకర్ షాక్‌తో చూస్తూ.. ) యాంకర్ : ఈయన నాకే కాదు.. ఎవరికీ అర్థం కాడు.. ఎందుకంటే.. ఈయన "రాం గోపాల్ వర్మ" కాదు.. -------------

Comments

Popular posts from this blog