#bedtimestories #moralstories #panchatantrakathalu ************ పిల్లి చెప్పిన తీర్పు ************* అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు తొర్రలో కాకి ఒకటి నివసిస్తూ వుండేది. ఒకనాడది ఆహారం కోసం వెళ్ళి వచ్చేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. కాకి బయటకు వెళ్ళిన సమయంలో ఒక కుందేలు వచ్చి కాకి నివసించే తొర్రలో దూరి పడుకుంది. కాకి సాయంత్రం వచ్చి తానుండే తొర్రలో కుందేలు ఉండడం చూసి ‘ఎవరు నువ్వు? ఇది నా నివాసం. నేను లేని సమయం చూసి ఆక్రమించుకున్నావా? వెంటనే వెళ్ళిపో’ అంది కోపంగా. అప్పుడా కుందేలు ‘ఆహా.. ఈ చెరువులు, గుహలు, చెట్లు, తొర్రలూ ఇవన్నీ ఏ ఒక్కరి సొత్తూ కాదు. అందరికీ చెందుతాయి. ఆ సమయంలో ఎవరు నివాసముంటే వారివే అవుతాయి. ఇప్పుడు నేనున్నాను కనుక ఇది నాదే. నీవే ఇంకో చోటు వెతుక్కో. ఫో ఇక్కడినుంచి’ అని కసిరింది. కుందేలు మాటలకి ‘నా ఇంటిని ఆక్రమించి పైగా నన్నే పొమ్మంటున్నావా? ఇది అన్యాయం. నువ్వే వెళ్ళిపో లేదా నీకూ నాకూ పోట్లాట తప్పదు.’ మరింత కోపంగా అన్నది కాకి. అలా అవి రెండూ కాసేపు తగవులాడుకున్నాయి. చివరికి .. "సరే, ఎవరైనా పెద్దలను న్యాయమడుగుదాము. వారు చెప్పినట్లు నడుచుక