మాయా బంగారు నాణాల పెట్టె || Magical gold coins box Telugu moral stories ...


#మాయాబంగారునాణాలపెట్టె #Magicalgoldcoinsbox #telugumoralstories ************* మాయా బంగారు నాణాల పెట్టె ************* ఒక ఊరిలో చంద్రయ్య అనే పేద రైతు వుండేవాడు. అతడు పేదవాడయినా చాలా నిజాయితీ పరుడు. కష్టపడి పని చేసే తత్వం కలవాడు. అయినా, అతడిని పరీక్షించడానికి కాబోలు విథి ఎప్పుడూ కష్టాలు పాలు జేస్తూ వుండేది. అతడికి కష్టం వచ్చిన ప్రతీసారీ అదే ఊరిలో వుండే కనకయ్య అనే వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అప్పు చేస్తూ వుండేవాడు. కనకయ్య పరమ పిసినారి. ఒక్క పైసా కూడా చెయ్యి జార నిచ్చే వాడుకాదు. పైగా తను అప్పులు ఇచ్చిన వాళ్ల దగ్గర రకరకాల వడ్డీలని చెప్పి అంతకు నాలుగైదు రెట్లు సొమ్ము వసూలు చేసేవాడు. ఒకనాడు అప్పుల ఊబిలోంచి ఎలా బయట పడాలో తెలియక దిగాలుగా పంట పనులు చేస్తున్న చంద్రయ్య " దేవుడా ... నా కష్టాలను తీర్చే మార్గం చూపవా.." అని ప్రార్దించాడు. కొంతసేపటికి పొలంలో అకస్మాత్తుగా అతని కాలికి ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే, చిన్న పెట్టె దొరికింది. ఆ పెట్టెను చంద్రయ్య చేతిలోకి తీసుకోగానే అంతలోనే దేవత ప్రత్యక్షమైంది.. "చంద్రయ్యా.. అది ఒక మాయా బంగారు నాణాల పెట్టె.. ఆ పెట్టెలో నీకు ఒక బంగారు నాణం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. చేయి పెట్టిన ప్రతీసారీ ఒకటి తప్పకుండా దొరుకుతుంది. నీకు కావలిసినన్ని బంగారు నాణాలు తీసుకున్నాక ఆ పెట్టేను నదిలో పారెయ్యి. అయితే ఒకటి గుర్తు పెట్టుకో,పెట్టెను నదిలో పడేసాక మాత్రమే నువ్వు డబ్బును ఖర్చు చేయాలి. అలా కాక పెట్టెను నదిలో పాడేయకుండా నీవు మధ్యలో ఖర్చు చేస్తే పెట్టెతో పాటు, నువ్వు తీసిని డబ్బు మొత్తం మాయమైపోతుంది .. జాగ్రత్త.." అని చెప్పి అదృశ్యమైపోయింది దేవత. తన కష్టాలు తీర్చే ఆ పెట్టెను తీసుకుని ఆనందంగా ఇంటికి చేరాడు చంద్రయ్య. అయితే ఆనోటా ఈనోటా దేవత ప్రసాదించిన బంగారు నాణాలు కురిపించే పెట్టె గురించి తెలుసుకున్న కనకయ్యలో ఆశ కలిగింది. ఎలాగైనా దాన్ని చేజిక్కించుకోవాలని చంద్రయ్యను కలిసి ఇలా అన్నాడు. " ఆ పెట్టెను నాకు ఇస్తే నీకు యాభైవేల వరహాలు ఇస్తాను.. " " అయ్యా.. నాకు మరీ అంత ఆత్యాశ లేదు.. మీ దగ్గర అప్పుగా తీసుకున్న ఐదు వందల వరహాలు పోనూ.. నాకు మరో అయిదు వందల వరహాలు ఇచ్చి ఈ పెట్టెను తీసుకుని వెళ్లండి.. నేను ఆ సొమ్ముతో కష్టపడి మళ్లీ నిలదొక్కుకుంటాను." అన్నాడు నిజాయితీగా చంద్రయ్య. తను ఇస్తానన్న డబ్బును కాదని చాలా తక్కువతో సరిపెట్టుకున్న అతడిని ఓ పిచ్చివాడిలా చూసి ఐదు వందల వరహాలు చెల్లించి ఆ పెట్టెను దక్కించుకున్నాడు కనకయ్య. ఆ పెట్టెను ఇస్తూ దేవత చెప్పిన నియమాలన్నీ కూడా వివరించాడు చంద్రయ్య. వడ్డీ వ్యాపారి కనకయ్య పరమానందంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకుని వెళ్లి ఆ రాత్రంతా పెట్టెలో నుంచి బంగారు నాణాలు తీసి ఒక పెద్ద సంచి నింపాడు.. ఆ మర్నాడు కూడా తిండీ నిద్రా మానేసి మరీ నాణేలు తీసి మరో పెద్ద గోనె సంచి నింపాడు. ఏమైనా తినడానికి కూర్చున్నా, నిద్రపోయినా సమయం వృధా అవుతుందని అలా వారం రోజులు పాటు ఏమీ తినకండా, తాగకుండా, నిద్రపోకుండా గడిపేస్తూ దాదాపుగా పది గోనెసంచుల నాణాలను కూడ బెట్టాడు. అప్పటికీ ఆశ తీరలేదు.. ఇంటిని మొత్తం బంగారు నాణాలతో నింపేయాలని పనిని ఆపలేదు. తన దురాశకు ఫలితంగా బాగా నీరసించిపోయి చివరకు ఒకరోజు అతడు అనారోగ్యంతో మంచాన పడ్డాడు.. తనను తాను కాపాడుకునే కంగారులో నియమాన్ని మరిచి బంగారు నాణాలను కూడా అమ్మేసాడు.. ఇంకేం, దేవత ఇచ్చిన ఆ మాయా బంగారు నాణాల పెట్టెతో పాటు అతడు అంత వరకూ పోగుచేసుకున్న నాణాలు కూడా మాయమైపోయాయి. దాంతో సంపాదించిన సొమ్ము పోయి, పైగా అనారోగ్యం పాలవడంతో కనకయ్య లబోదిబోమని ఏడవసాగాడు. ఈ కథలో నీతి ఏమిటంటే.. " దురాశ దుఃఖానికి చేటు. "

Comments

Popular posts from this blog