#మాయాబంగారునాణాలపెట్టె #Magicalgoldcoinsbox #telugumoralstories ************* మాయా బంగారు నాణాల పెట్టె ************* ఒక ఊరిలో చంద్రయ్య అనే పేద రైతు వుండేవాడు. అతడు పేదవాడయినా చాలా నిజాయితీ పరుడు. కష్టపడి పని చేసే తత్వం కలవాడు. అయినా, అతడిని పరీక్షించడానికి కాబోలు విథి ఎప్పుడూ కష్టాలు పాలు జేస్తూ వుండేది. అతడికి కష్టం వచ్చిన ప్రతీసారీ అదే ఊరిలో వుండే కనకయ్య అనే వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర అప్పు చేస్తూ వుండేవాడు. కనకయ్య పరమ పిసినారి. ఒక్క పైసా కూడా చెయ్యి జార నిచ్చే వాడుకాదు. పైగా తను అప్పులు ఇచ్చిన వాళ్ల దగ్గర రకరకాల వడ్డీలని చెప్పి అంతకు నాలుగైదు రెట్లు సొమ్ము వసూలు చేసేవాడు. ఒకనాడు అప్పుల ఊబిలోంచి ఎలా బయట పడాలో తెలియక దిగాలుగా పంట పనులు చేస్తున్న చంద్రయ్య " దేవుడా ... నా కష్టాలను తీర్చే మార్గం చూపవా.." అని ప్రార్దించాడు. కొంతసేపటికి పొలంలో అకస్మాత్తుగా అతని కాలికి ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే, చిన్న పెట్టె దొరికింది. ఆ పెట్టెను చంద్రయ్య చేతిలోకి తీసుకోగానే అంతలోనే దేవత ప్రత్యక్షమైంది.. "చంద్రయ్యా.. అది ఒక మాయా బంగారు నాణాల పెట్టె.. ఆ పెట్టెలో నీకు ఒక బంగారు నాణం