Friends and Bear Telugu moral story || రహస్యం నీతి కథ @BAMMA KATHALU


#రహస్యంనీతికథ #Telugumoralstories #bedtimestories **************** రహస్యం ****************** ఒక ఊరిలో రాము, సోము అనే ఇద్దరు మిత్రులు వుండేవారు. ఆ ఇద్దరు మొక్క జొన్న సాగు చేసేవారు. ఆ ఏడు పంట అయితే ఏపుగా పెరిగింది కానీ, వాటికి జొన్న కంకులు కాయలేదు. దాంతో వ్యవసాయంలో నష్టం వచ్చింది. ఇక రాము, సోములు ఆ ఊరిలో వుండి లాభం లేదనీ.. జీవనోపాధి కోసం పొరుగూరికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. పొరుగు ఊరికి వెళ్లాలంటే మధ్య దారిలో ఒక అడవి వస్తుంది. దట్టమైన ఆ అడవి దాటితేకాని పొరుగూరికి చేరలేరు. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయని వారికి తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసి కట్టుగా ఎదిరించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం మ‌ర్నాడు పొరుగూరికి బయలుదేరారు రాము, సోము. అలాగే అడవిలోకి ప్రవేశించారు. గట్టిగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడవసాగారు.. అలా కొంత దూరం నడిచిన వారికి హఠాత్తుగా దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది. వెంటనే ఇద్దరూ మరింత భయపడిపోయారు. “ఏం చేద్దాం?” అన్నాడు రాము. "వేగంగా పారిపోదాం.." అన్నాడు సోము. "మనల్ని వెంబడించి మరీ పట్టుకుంటుందీ.." “అయితే, చెట్టు ఎక్కేద్దాము..” “కాని నాకు చెట్టు ఎక్కడం రాదే! ఇద్దరం కలిసి దాన్ని ఎదిరిద్దాం..” “నాకు చెట్టు ఎక్కడం వచ్చు కదా, నీ దారి నీవు చూసుకో..” అని సోము చేయి వదిలించుకుని గబ గబా పక్కనున్న చెట్టు ఎక్కేసాడు. రాముకి చెట్టు ఎక్కడం రాదు కదా! ఏం చేస్తాడు? తన మిత్రుడేమో ఇలాంటి పరిస్థితిలో వంటరిగా వదిలేసాడు! తన వైపుకే వస్తున్న ఎలుగు బంటిని చూసి వెంటనే నేల మీద చడీ చప్పుడు చేయకుండా శవంలా పడుకున్నాడు. ఎలుగుబంటి రాము దగ్గరకు వచ్చింది. పాపం, ఊపిరి కూడా బిగబట్టి అలాగే ఏమాత్రం కదలకుండా పడుకున్నాడు. అతని ముఖానికి దగ్గరకు వచ్చి వాసన చూసి కొంతసేపు పరీక్షించింది.. అతడు చనిపోయాడనుకుంది.. ఎలుగుబంటి చనిపోయిన జీవులను తినదు. అందుకే చివరికి అతన్ని వదిలి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయాక రాము నెమ్మదిగా లేచాడు. "హమ్మయ్య! " అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు. సోము కూడా చెట్టు మీంచి దిగాడు. ఎలుగుబంటి రాముకి దగ్గరగా వచ్చి వాసన చూసినప్పుడు అతని చెవిలో ఏదో రహస్యం చెప్పిందనుకుని అపోహపడ్డాడు. “ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలో ఏమి చెప్పింది రా..” అని అడిగాడు. “అవసరానికి ఆదుకోని వాళ్ళు స్నేహితులే కారు, అని నాతో ఎలుగుబంటి చెప్పింది” అని రాము జవాబిచ్చి తన దారి తాను చూసుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే.. "క‌ష్ట‌ సుఖాల్లో తోడుండేవాడే నిజ‌మైన స్నేహితుడ‌ు...."

Comments

Popular posts from this blog