బావిలో నక్క-జింక నీతి కథ || Intelligent Fox and Deer Telugu Moral Stories



#telugustories #telugumoralstories #moralstories ************* బావిలో నక్క-జింక నీతి కథ ************* అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది. బావి చాలా లోతుగా వుండటం తో అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. " రక్షించండీ..రక్షించండీ.. నన్ను ఎవరైనా కాపాడం డీ.. " అం టూ అరవసాగింది. తెల్లారేదాక అలాగే అరుస్తూ, ప్రయత్నిస్తూనే బావిలో ఉండిపోయింది నక్క. మర్నాడు ఆ బావికి కాస్త దూరం గా వెళ్తున్న జింక ఏదో అలికిడి కావడం తో అక్కడికి వచ్చి బావిలోకి తొంగి చూసింది. జింకను చూడగానే “అమ్మ య్య! మనం బయట పడచ్చు”, అనుకుంది నీళ్ళల్లో ఉన్న నక్క . జింక బావిలో వున్న నక్కని చూస్తూ "బావిలో ఏం చేస్తున్నావు?” అని అడిగింది. “ఈ బావిలో నీళ్ళు ఎంత బాగున్నాయో తెలుసా? ఈ నీళ్ళు తాగడానికే బావిలోకి వచ్చాను. అసలు చక్కర కలిపినం త తీయగా వున్నాయి!” అని తెలివిగా చెప్పిం ది నక్క. “అవునా! నిజమా?” అని అడిగింది జింక. “కావాలంటే నువ్వు దిగి చూడు? అసలు ఇలాంటి నీళ్ళు నువ్వు ఎప్పుడు తాగి ఉండవు” అం ది నక్క. అమాయకురాలైన జింక ముందు వెనక ఆలోచించకుండా నూతి లోకి దూకేసింది. నీళ్ళు తాగింది. కొంత సేపటికి నక్క లానే జింక కూడా బావిలో ఇరుక్కు పోయింది. “ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా?” అని నక్కని అడిగింది. “ముందు నీ వీపు పై ఎక్కి నేను బయటికి వెళ్లి, తరువాత నిన్ను పైకి లాగేస్తాను!” అని ఐడియా ఇచ్చింది నక్క. సరే బాగానే ఉంది అనుకుని జింక ఒప్పుకుంది. నక్క జింక వీపెక్కి ఒక గెంతు వేసి నూతి లోంచి బయట పడింది! తర్వాత, జింక బయటికి రావడానికి చేయి అం దించమని అడిగింది. “అమ్మో..! అం త బరువున్న నిన్ను ఇం తలోతు బావిలోంచి నేను లాగగలనా..?! నావల్ల కాదు.. నన్ను గట్టెక్కంచినం దుకు కృతజ్ఞతలూ.. ” అని చెప్పి నవ్వుకుంటూ వెళ్లి పోయింది నక్క . మొత్తానికి జింకకు, నక్క చేసిన మోసం అర్ధం అయ్యింది. కాని ఏమి లాభం? పాపం, బావిలో ఒం టరిగా మిగిలిపోయింది. అం దుకే పెద్దలు చెబుతారు.. “ అడుగు ముందుకు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలనీ..”

Comments

Popular posts from this blog